నేటి నుండి పరిశుభ్రత- పారిశుధ్య కార్యక్రమం..

287
sanitation drive
- Advertisement -

సీజనల్‌ వ్యాధులను అరికట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం రూపొందించిన ప్రత్యేక పారిశుద్ధ్య కార్యాచరణ ప్రణాళిక కార్యక్రమం నేటినుండి ప్రారంభంకానుంది. జూన్ 8 వరకు జరిగే ఈ కార్యక్రమంలో భాగంగా దోమల నివారణ చర్యలు తీసుకోవడంతో పాటు మురుగు కాల్వల్లో పూడికతీత, నీరు నిల్వ ఉండే ప్రదేశాలను గుర్తించి వాటిని శుభ్రం చేయడం, పిచ్చి మొక్కలను తొలగించడం వంటివి చేయనున్నారు.

ఇందుకు సంబంధించిన ప్రణాళికను ఇప్పటికే అధికారులకు సీఎం కేసీఆర్ వివరించిన సంగతి తెలిసిందే. పరిశుభ్రత- పారిశుధ్య కార్యక్రమం వివరాలు..

– మురికి కాలువలను శుభ్రం చేసి మురుగు నీరు, వర్షపు నీటి ప్రవాహాలకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా చర్యలు చేపట్టనున్నారు. వర్షపు నీరు, వృధాగా పోయే నీరు నిలువకుండా గుంతలను మొరంతో నింపనున్నారు. మెయిన్ రోడ్లు, గ్రామాల్లోని రోడ్ల గుంతలను పూడ్చి…. రోడ్లపై ఎలాంటి నీరు నిలువకుండా చర్యలు తీసుకోనున్నారు

– నీటి పైపు లైన్ల లీకేజీలుంటే గమనించి వాటిని సరిచేసి…. లీకేజీలతో నీరు కలుషితం కాకుండా జాగ్రత్తలు చేపట్టనున్నారు.

– ఓవర్ హెడ్ ట్యాంకులు, భూ గర్భ నీటి ట్యాంకులు, సిమెంట్ ట్యాంకులు, మెటల్ డ్రమ్ములు, మట్టి గంగాళాలు, వాటర్ హార్వెస్టింగ్ ట్యాంకుల్లో దోమల లార్వాలను నాశనం చేసే జాగ్రత్తలు తీసుకోనున్నారు.

– అన్ని నివాసాల్లో ఫాగింగ్ చేపట్టనున్నారు.

– దోమల లార్వాలను నశింపచేసే బైటెక్స్ స్ప్రే చేయించటంతో పాటు ఆయిల్ బాల్స్ ను నిరంతరంగా ప్రయోగించనున్నారు.

– ఖాళీ ప్రదేశాల్లో చెత్తను, పొదలను, పనికిరాని అటవీ సంబంధిత మొక్కలను తొలిగించి శుభ్రతను పర్యవేక్షించనున్నారు.

– బస్టాండ్లు, మార్కెట్లు, స్కూళ్ళ పరిసరాలు, హాస్పటళ్ళ పరిసరాలు, రేషన్ షాపులు, బండ్ల స్టాండ్లలో 1 శాతం సోడియం హైపో క్లోరైట్ ఫెనాలిక్ డిస్ ఇన్ఫెక్టెంట్ తో పిచికారి చేయనున్నారు.

- Advertisement -