లక్షా 82 వేలకు చేరిన కరోనా కేసులు…

313
coronavirus india
- Advertisement -

దేశంలో రోజురోజుకి కరోనా కేసులు పెరిగి పోతున్నాయి. గడిచిన 24 గంటల్లో 8,380 కేసులు నమోదుకాగా 193 మంది చనిపోయారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.

ఇక దేశంలో ఇప్పటివరకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,82,143కి చేరగా మృతుల సంఖ్య 5,164కు చేరింది. ఇప్పటివరకు 86,984 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు.

దేశంలో పాజిటివ్ కేసుల సంఖ్యలో మహారాష్ట్ర టాప్ పొజిషన్‌లో ఉంది. ఇప్పటివరకు మహారాష్ట్రలో 65,168 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, 2,197 మంది చనిపోయారు.

తమిళనాడులో 21,184, ఢిల్లీలో 18,549, గుజరాత్‌లో 16,356, రాజస్థాన్‌లో 8,617, మధ్యప్రదేశ్‌లో 7,891, యూపీలో 7,701, బెంగాల్‌లో 5,130, బీహార్‌లో 3,565, ఏపీలో 3,461, కర్ణాటకలో 2,922, తెలంగాణలో 2,499లు నమోదయ్యాయి.

- Advertisement -