లాక్డౌన్ 4.0 ముగుస్తున్న నేపథ్యంలో కీలక ప్రకటన చేసింది. దేశవ్యాప్తంగా లాక్ డౌన్‌ను జూన్ 30 వరకు పొడగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రాత్రి 9 నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ కొనసాగనుంది. జూన్ 8 నుంచి ప్రార్థనా మందిరాలు తెరిచేందుకు అనుమతించింది.
కేవలం కంటైన్మెంట్ జోన్లకే లాక్డౌన్ పరిమితం చేసింది. కంటైన్మెంట్ జోన్ల వెలుపల అన్ని కార్యకలాపాలు దశలవారీగా తిరిగి ప్రారంభించుకునేందుకు అనుమతినిచ్చింది.
ఆంక్షల సడలింపులతో కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో లాక్‌డౌన్‌ను మరికొన్ని రోజుల పాటు కొనసాగించాలని కేంద్రాన్ని ఇప్పటికే పలు రాష్ట్రాలు కోరాయి.
దశల వారిగా కంటైన్ మెంట్ జోన్ల వెలుపల ఆంక్షల సడలింపు….
మొదటి దశ:
జూన్ 8 వ తేదీ నుంచి అన్ని మతాల ఆలయాలు, ప్రార్ధనలు చేసుకునేందుకు ప్రజలకు అనుమతి.
హోటల్స్, రెస్టారెంట్లు, హాస్పిటాలిటీ సేవలకు సడలింపు.
ఇందుకు సంబంధించిన ప్రామాణిక నిబంధనలను త్వరలో కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేస్తుంది.
రెండవ దశ…
పాఠశాలలు, కళాశాలలు, శిక్షణ సంస్థలకు అనుమతి.రాష్ట్ర ప్రభుత్వాలతో ఆయా సంస్థల చర్చల అనంతరం పునరుద్ధరణకు అనుమతి.ఇందుకు సంబంధించిన ప్రామాణిక నిబంధనలను కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేస్తుంది.జూలై నెలలో వీటిని తెరవడానికి అనుమతి.
మూడో దశ లో అంతర్జాతీయ విమాన సర్వీసులు, మెట్రో రైల్ సినిమాహాళ్లు, స్విమ్మింగ్ పూల్స్, జిమ్‌లు, బార్లు, వినోదాత్మక పార్కులు, సామాజిక, రాజకీయ, క్రీడా, వినోద సమావేశాలు… మొదలగునవి పరిస్థిని బట్టి పునరుద్ధరణ తేదీలపై నిర్ణయం ఉంటుందని తెలిపింది కేంద్రం.