రైతును రాజు చేసేందుకే నియంత్రిత సాగు…

748
Minister-Vemula-Prashanth-Reddy
- Advertisement -

ముఖ్య అతిధిగా రాష్ట్ర రోడ్లు-భవనాలు, గృహ నిర్మాణ మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి..సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే హన్మంత్ షిండే,డిసిసిబి చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, జడ్పీ చైర్పర్సన్ దఫెదార్ శోభరాజు ఇతర ప్రజాప్రతినిధులు, రైతు బంధు సమితి అధ్యక్షుడు అంజిరెడ్డి,వ్యవసాయ శాఖ అధికారులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ..కేసీఆర్ బ్రతికున్నన్ని రోజులు రైతు మీద గీత పడనీయరని. రైతు కు ఏమన్నా అయితే విలవిలలాడుతారని ఆంధ్ర ప్రాంతం రైతు కన్నా తెలంగాణ రైతు గొప్పగా ఉండాలని పరితపిస్తారన్నారు.

అందుకే రైతులకు ఎన్ని చెయ్యాల్నో అన్ని చేస్తున్నారు.జుక్కల్ కు నెత్తి మీద ప్రాజెక్టు ఉన్న నీళ్లు రాని పరిస్థితి ఏర్పడిందన్నారు.
తెలంగాణ లో కేవలం బోర్లు వేయడం కోసం 40 వేల కోట్లు ఖర్చు చేశారు.వాటి ఖర్చుతో నాలుగు ప్రాజెక్టు లు కట్టొచ్చు అన్నారు.

ఈ నీటి కష్టాలు పోవడానికే ముఖ్యమంత్రి కేసీఆర్ 6 సంవత్సరాల క్రితం వేసుకున్న ప్లాన్ ప్రకారం ఇవాళ సాగునీటి ప్రాజెక్టులు రూపుదిద్దుకున్నాయి.హల్ది ప్రాజెక్టు ద్వారా నిజాం సాగర్ కు నీళ్లు తెచ్చి నాగమడుగు లిఫ్ట్ ద్వారా వివిధ ప్రాంతాలకు నీళ్లు ఇవ్వబోతున్నాం.

రైతులు పంటలు సమృద్ధిగా పండించాలనేది ముఖ్యమంత్రి కోరిక..అది లాభసాటి పంటలైతే రైతులకు ఇంకా మేలు అన్నారు. ఇతర రాష్ట్రాల్లో 40 శాతం మించి పంటను ఏ ప్రభుత్వం కొనుగోలు చేయదన్నారు. కానీ కేసీఆర్ మొండివాడు కాబట్టి తెలంగాణ రైతులు పండించిన పంటను వందశాతం కొంటున్నాడు.

కానీ ప్రతిసారి కొనే పరిస్థితి ఉండకపోవచ్చు. రైతులు మార్కెట్ డిమాండ్ ఉన్న పంటలు వేసుకుంటే..పంటను లాభసాటి ధరకు అమ్ముకోవచ్చు.అందుకోసమే వ్యక్తులతో,పార్టీలతో,ప్రభుత్వం తో సంబంధం లేకుండా..ఏ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ఓ సిస్టం ను ఫాలో కావాలని కోరుకుంటున్నారు.కేసీఆర్ రైతు కాబట్టి రైతు పండించిన మొత్తం పంటను కొంటున్నాడు. మరి తర్వాత 10 ఏండ్లకు వేరే ప్రభుత్వం వస్తే రైతు పరిస్థితి ఏంటి అని ఆలోచన చేసే..వ్యవస్థలో మార్పు చేస్తున్నారని వెల్లడించారు.

రైతు ఎవరికి చేయి చాచొద్దు అనేది ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశయం అని…ముఖ్యమంత్రి లాభసాటి పంటల విధానం కోసం రెండు కమిటీలు ఏర్పాటు చేశారని తెలిపారు.

ఒక కమిటీ లో శాస్త్రవేత్తలు, ప్రొఫెసర్లు,వి.సిలు,వ్యవసాయ రంగనిపుణులు ఉంటారని…వీరు ఏ వాతావరణంలో ఏ పంటలు వేయాలి. ఏ భూమిలో ఏ పంటలు పండుతాయి వీటి మీద పరిశోధనలు చేస్తారని చెప్పారు.

రెండోది మార్కెటింగ్ కమిటీ

మార్కెటింగ్ నిపుణులు ఈ కమిటీలో ఉంటారు. వీరు దేశంలో ఏ పంటకు డిమాండ్ ఉంది. ఏ పంటలు పండించాలి. ఏవి తింటున్నారు. ఏ రాష్ట్రంలో ఏది డిమాండ్ ఉంది అనేక విషయాలు వీరు అధ్యయనం చేస్తారన్నారు. మనం పండించే పంటల గురించి మూడు నెలల ముందే చెప్తారని…అంటే మన దగ్గర పండే పంటలే.. జొన్నలు,కందులు, వరి, పత్తి పంటల గురించే చెప్తారని తెలిపారు.

మార్కెటింగ్ విధానంలో ఓ మార్పు రావాలని ముఖ్యమంత్రి బలంగా కోరుకుంటున్నారని వెల్లడించారు. ఇప్పుడు 80 లక్షల ఎకరాల్లో వరి పండింది.70 లక్షల ఎకరాల్లో పండించే వరి ధాన్యం చాలు…అందులో సన్నరకం ఎక్కువ పండించాలి.ఎక్కువ మంది సన్నరకం తింటారు.పంట ఏమో దొడ్డు రకంపండిస్తున్నాం అన్నారు.

80శాతం మంది సన్నబియ్యం తింటే..20 శాతం మంది దొడ్డు బియ్యం తింటారు. కానీ 15 శాతం మాత్రమే సన్నరకం పండిస్తున్నాం.85శాతం డొద్దురకం పండిస్తే ప్రభుత్వం కొనకుంటే రైతు పరిస్థితి ఏం కావాలె. కాబట్టి రైతులు సన్నరకం వడ్లు ఎక్కువ పండించాలి. మార్కెట్ లో దాదాపు 2వేల ధర కచ్చితంగా వస్తుందన్నారు.

- Advertisement -