- Advertisement -
ప్రపంచ దేశాలను గజగజ వణికిస్తున్న కరోనా భారత్‌లో కూడా ఉగ్రరూపం దాల్చుతోంది. ఇప్పటివరకు భారత్‌లో కరోనా కేసుల సంఖ్య 1,38,845కు చేరుకున్నది. గత 4 గంటల్లో కొత్తగా 6,977 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
దీంతో ప్రస్తుతం భారత్ కరోనా మహమ్మారి బారిన పడి విలవిలలాడుతున్న టాప్-10 దేశాల్లో చేరింది. ఇక దేశంలో కరోనా వైరస్‌కు అడ్డాగా మారింది ముంబై. ఇక్కడ 30 వేలకు పైగా కరోనా కేసులు నమోదు కావడం విశేషం.
వచ్చే నెల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉండనుందని ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు. రాష్ట్రాల వారీగా పరీక్షలు నిర్వహిస్తున్న సంఖ్య పెరుగడం దేశంలో కరోనా పరిస్ధితి ఎంత ఆందోళన కరంగా ఉందో తెలియజేస్తుందన్నారు. ఇప్పటికే రెండు నెలలు లాక్డౌన్లో ఉన్న దేశాన్ని ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా మరెంతో కాలం లాక్డౌన్లో ఉంచలేమన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
- Advertisement -