పల్లె ప్రగతి వెలుగులో… ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనాని సైతం ఎదుర్కోగలిగాం అని తెలిపారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు.సీజనల్ వ్యాధులు, ముందు జాగ్రత్తగా వాటి నివారణ చర్యలు పై వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు ఎర్రబెల్లి దయాకర్ రావు.
ఈ సందర్భంగా మాట్లాడిన ఎర్రబెల్లి…సీఎం కేసీఆర్ రూపొందించిన పల్లె ప్రగతి రెండు కార్యక్రమాలు విజయవంతమయ్యాయని చెప్పారు.పల్లె ప్రగతి తో గ్రామాల ముఖ చిత్రాలు మారిపోయాయని…పల్లె ప్రగతికి దేశ వ్యాప్తంగా అనేక ప్రశంసలు వచ్చాయన్నారు.
పల్లె ప్రగతిని విజయవంతం చేసిన ప్రజాప్రతినిధులు, అధికారులకు అభినందనలు తెలిపారు. పల్లె ప్రగతి విజయవంతం కారణంగానే కరోనా నుంచి గ్రామాలు సురక్షితంగా ఉన్నాయన్నారు.
పల్లె ప్రగితిని కొనసాగిస్తూనే, వచ్చే వర్షాకాల సీజనల్ వ్యాధులను ఎదుర్కోవాలన్నారు. డెంగీ, మలేరియా, స్వైన్ ఫ్లూ వంటి అనేక రకాల సీజనల్ వ్యాధుల నుంచి ప్రజలను సురక్షితంగా ఉంచాలన్నారు. గ్రామాల్లో పారిశుద్ధ్యంతోపాటు, నీరు నిలువ ఉండే చోట్లను గర్తించి నివారించాలన్నారు.
మంచినీటిని పరిశుభ్రంగా…స్వచ్ఛంగా అందించాలని..దోమలు పెరగకుండా ముందుగానే జాగ్రత్త చర్యలు చేపట్టాలన్నారు. ప్రజల్లో వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పారిశుద్ధ్యంపై అవగాహన పెంచాలన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో అన్ని జిల్లాల పరిషత్ చైర్మన్లు, జిల్లా కలెక్టర్లు, అడిషనల్ కలెక్టర్లు, డిఆర్ డిఓ లు, జెడ్పీ సీఇఓలు, డిపిఓలు, ఎంపీడీఓలు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ లు, ఆర్ డబ్ల్యు ఎస్ అధికారులు పాల్గొన్నారు.