ప్రతీ రైతుకు రైతు బంధు: పువ్వాడ

295
puvvada ajay
- Advertisement -

రైతు రుణమాఫీ ప్రక్రియ మొదలైంది..ప్రతీ రైతుకు రైతు బంధు వచ్చి తీరుతుందన్నారు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్. ఖమ్మం జిల్లా వీవీ పాలెంలో మాట్లాడిన ఆయన రైతుల సంక్షేమ మే ధ్యేయం గా నడుస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అన్నారు.

24 గంటల ఉచిత కరెంటు , రైతుబంధు సాయం , పంటల కొనుగోలు చేస్తున్నది కేసీఆర్ ప్రభుత్వం అన్నారు. కేసీఆర్ మదిలో నిత్యం రైతులు , వారి సంక్షేమం గురించే మదనం జరుగుతుందన్నారు. ప్రతీ గింజను కొనుగోలు చేసిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు.

రైతులు సంఘటితం కావాలి .. రైతులు చెప్పిన ధరకే పంటలు కొనుగోలు చేసే పరిస్థితి రావాలన్నారు. ప్రతీ 5 వేల ఎకరాలకు ఒక క్లస్టర్ గా ఏర్పాటు చేశాం.. ప్రతీ క్లస్టర్ కూ ఏఈవో ఉంటారని చెప్పారు. రైతు సాగు చేసే ప్రతి పంట వివరాలు ప్రభుత్వం దగ్గర ఉంటాయన్నారు పువ్వాడ.

గతంలోవిత్తనాలు , ఎరువుల కోసం రైతులు లాఠీ దెబ్బలు చరిత్ర మనం చూశాం ..కానీ కేసీఆర్ పాలన ఆరేళ్ల లో ఎక్కడ ఇలాంటి
సంఘటనలు లేదన్నారు. రైతు బంధు వేదికల నిర్మాణం చేపడుతున్నాం….రఘునాథపాలెంలో రైతుబంధు వేదికను నా స్వంత ఖర్చులతో నిర్మిస్తున్నాని చెప్పారు.

కూరగాయలు , పండ్ల సాగు ద్వారా రైతులు అధిక ఆదాయం పొందవచ్చని…సీతారామ ప్రాజెక్ట్ ద్వారా ఖమ్మం జిల్లాలో ప్రతీ ఎకరాకు నీళ్లు ఇస్తామన్నారు. వచ్చే ఖరీఫ్ నాటికి గోదావరి నీళ్లు ఎన్.ఎస్.పీ కి మళ్లించబడతాయని స్పష్టం చేశారు.

- Advertisement -