శ్రీలంక టూర్‌పై బీసీసీఐ క్లారిటీ…

273
bcci
- Advertisement -

టీమిండియా…శ్రీలంక పర్యటనపై క్లారిటీ ఇచ్చింది బీసీసీఐ. జూలైలో భారత పర్యటనను రద్దు చేయవద్దని శ్రీలంక బోర్డు…బీసీసీఐని కోరిన నేపథ్యంలో బీసీసీఐ కోశాధికారి అరుణ్ దుమాల్ స్పందించారు.

లాక్‌డౌన్‌ సడలింపులు, ప్రయాణ ఆంక్షల ఎత్తివేత తదితరల అంశాలు కేంద్రం తీసుకునే నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని చెప్పారు. శ్రీలంకలో కరోనా ప్రభావం తక్కువగా ఉందని…. అన్ని సక్రమంగా ఉంటే లంకలో పర్యటించేందుకు సిద్ధంగానే ఉన్నామని స్పష్టం చేశారు.

ఈ ఏడాది జూన్- జులై‌లో కోహ్లీ సేన శ్రీలంక టూర్‌కి వెళ్లాల్సి ఉంది. మూడు వన్డేలు, మూడు టీ20ల సిరీస్ జరగనుండగా కరోనా నేపథ్యంలో లంక టూర్‌పై సందిగ్దం నెలకొంది. ఈ నేపథ్యంలోనే క్లారిటీ ఇచ్చింది బీసీసీఐ.

- Advertisement -