ఎన్టీఆర్, చరణ్‌లు హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో భారీ బడ్జెట్‌లో తెరకెక్కుతున్న చిత్రం ఆర్ ఆర్ ఆర్ (రౌద్రం రణం రుథిరం). ఈ సినిమాలో ఎన్టీఆర్, చరణ్‌లు చారిత్రక వీరులైన కొమరం భీమ్, అల్లూరి సీతారామ రాజు పాత్రలు చేస్తున్నారు. వీరికి జంటగా ఇంగ్లీష్ నటీ ఒలివియా మోరీస్, హీందీ నటి ఆలియా భట్ నటిస్తున్నారు. మరో ప్రధాన పాత్రలో హిందీ సూపర్ స్టార్ అజయ్ దేవగన్ నటిస్తున్నాడు. దీంతో ఈ మూవీపై దేశ వ్యాప్తంగా భారీ క్రేజ్ నెలకొని ఉండగా, అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా రాజమౌళి తెరకెక్కిస్తున్నారు.
ఇక ఈ నెల 20న జూనియర్ ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్బంగా ఒక బహుమానం సిద్దమవుతుంది అని సినిమా నిర్మాత దానయ్య ప్రకటించాడు. ఆ బహుమానం ఏంటనేది చెప్పకపోయినా అభిమానులంతా ఇంకో వీడియో విడుదల అవనుందని ఫిక్స్ అయిపోయారు. చూడాలి లాక్‌డౌన్ ఎఫెక్ట్ షూటింగ్‌పై ఉన్నా వీడియో సిద్దం అవుతుందా, రాజమౌళి విడుదల చేస్తారా అని. విడుదల అయితే ఇక ఆ వీడియో ఎంతగా ఆకట్టుకోనుందో అని అభిమానులు అంచనాలు వేసేస్తున్నారు.