లాక్ డౌన్.. చైతో బైక్ రైడ్‌కు వెళ్లిన సామ్‌..!

331
Sam And Chai On An Errand Run Be Like
- Advertisement -

లాక్ డౌన్ నేపథ్యంలో సినీ సెలబ్రెటీలంతా ఇంటికే పరిమితమయ్యారు. అనుకోకుండా దొరికిన ఈ ఖాళీ సమయాన్ని కుటుంబంతో కలసి సరదాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఒకవైపు వర్కౌట్ వీడియోలను ఫోటోలను టిక్ టాక్ వీడియోలను షేర్ చేస్తూ.. మరోవైపు తమ ఫ్యాన్స్ కు కరోనా సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు సూచిస్తున్నారు. ఇక సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే సమంత అక్కినేని కూడా లాక్ డౌన్ లో రకరకాల పోస్టులతో సోషల్ మీడియాను హోరెత్తిస్తోంది. ఇప్పుడు తాజాగా సామ్ ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన ఫోటో వైరల్ అయింది.

తాజాగా బైక్ పై తన భర్త నాగ చైతన్యతో షికారుకు వెళుతున్న ఫోటోను షేర్ చేసింది. దీనికి బ్రెడ్ ఎమోజీని క్యాప్షన్‌గా జత చేసింది. నాగ చైతన్య హెల్మెట్ పెట్టుకొని బైక్ స్టార్ట్ చేయడానికి రెడీగా ఉండగా సామ్ మరో హెల్మెట్ పట్టుకొని వెనుక కూర్చొని ఉంది. దీనిపై నెటిజన్స్ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. సమంత ఇటీవల శర్వానంద్‌‌తో కలిసి నటించిన ‘జాను’ ఆ మధ్య విడుదలైంది.

- Advertisement -