తెరుచుకున్న బద్రీనాథ్ ఆలయం..

309
Badrinath temple
- Advertisement -

ప్రసిద్ధ పుణ్యక్షేత్రం బద్రీనాథ్ ఆలయం తెరుచుకుంది. శీతాకాల విరామం అనంతరం ఉత్తరఖండ్‌లోని బద్రీనాథ్ ఆలయం తలుపులను ఉదయం 4.30 గంటలకు ఓపెన్ చేశారు. ఆలయాన్ని బంతిపూలతో అందంగా అలంకరించగా ప్రధాన పూజారితో సహా కేవలం 28 మంది హాజరయ్యారు.

ఏప్రిల్‌ 30వ తేదీన తెరుచుకోవాల్సిన ఆలయం తలుపులు లాక్‌డౌన్‌ కారణంగా తెరుచుకోలేదని గుడి ధర్మాధికారి భవన్‌ చంద్ర ఉనియాల్‌ తెలిపారు. ఉత్తరఖండ్‌ ముఖ్యమంత్రి త్రీవేంద్రసింగ్‌ రావత్‌, గవర్నర్‌ బేబీ రాణి మౌర్య ఆలయంలో ప్రత్యేక ప్రార్థనలు చేయనున్నారు.

- Advertisement -