ఎన్టీఆర్‌ ఫారిన్‌ ట్రిప్‌…

325
Jr NTR Plans Foreign Trip With Family
Jr NTR Plans Foreign Trip With Family
- Advertisement -

ఎన్టీఆర్ విహారయాత్రకు వెళుతున్నాడా.. ఫ్యామిలీతో ఫారిన్ లో రిలాక్స్ కాబోతున్నాడా.. అంటే అవుననే అంటోంది టాలీవుడ్. యంగ్ టైగర్ ఎన్టీఆర్ చాలా నెలలుగా కష్టపడుతూనే ఉన్నాడు. నాన్నకు ప్రేమతో చిత్రం కోసం ఫారిన్ లోనే చాలా నెలలు గడిపేసినా.. అది సుకుమార్ సినిమా కావడంతో షూటింగ్ కి చాలానే సమయం వెచ్చించాల్సి వచ్చింది. ఈ ఏడాది ఆ సినిమా సంక్రాంతికి వచ్చి సక్సెస్ సాధించాక.. కొంచెం కూడా బ్రేక్ తీసుకోకుండా జనతా గ్యారేజ్ స్టార్ట్ చేసేశాడు. అప్పటికే ముహూర్తం పూజ.. ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ లాంటివి పూర్తయిపోవడంతో.. పది రోజుల వ్యవధిలోనే గ్యారేజ్ సెట్స్ పైకి వెళ్లిపోయాడు జూనియర్.
వెకేషన్ ట్రిప్ వేయటంలో మహేష్ బాబు ముందుంటారు. ఏడాదిలో కనీసం మూడుసార్లు అయినా ఫ్యామిలీతో విదేశాల్లో తిరిగి వస్తుంటారు. ప్రస్తుతం ఎన్టీఆర్ కూడా అలాంటి ట్రిప్ ప్లాన్ చేయబోతున్నాడు. ఓ పది రోజులు ఫ్యామిలీని తీసుకుని వెళ్లాలని డిసైడ్ అయ్యాడు. ఎక్కడికి అనేది చెప్పకపోయినా.. సినీ ప్రపంచానికి దూరంగా ఉండబోతుందని మాత్రం కన్ఫామ్ అంటున్నారు. జనతా గ్యారేజ్ రిజల్ట్ కూడా వచ్చేసింది.

ఏడు నెలలుగా షూటింగ్ బిజీలోనే ఉన్న ఎన్టీఆర్ ఇప్పుడు ఫ్రీ అయినట్లు సమాచారం. ప్రస్తుతానికి నెక్ట్స్ ప్రాజెక్ట్ కూడా ఇంకా అనౌన్స్ చేయలేదు. విహారయాత్ర నుంచి తిరిగి వచ్చిన తర్వాత వక్కంతం వంశీతో మూవీని అనౌన్స్ చేస్తారనేది సమాచారం. వినాయక చవితి తర్వాత ఫ్లయిట్ ఎక్కే ఎన్టీఆర్.. 20వ తేదీన తిరిగి రానున్నట్లు టాక్. సో.. నెలాఖరుకు కొత్త మూవీ అనౌన్స్ మెంట్ ఉంటుందని ఫిల్మ్ ఇండస్ట్రీ సమాచారం.

- Advertisement -