పవన్ బర్త్ డే.. రేణుదేశాయ్ ట్విట్

234
Renu Desai
Renu Desai
- Advertisement -

ఎప్పటిలానే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన పుట్టినరోజు వేడుకలకు దూరంగా ఉన్నారు. పవన్ ఫ్యాన్స్ కూడా కామ్‌గా ఉండిపోయారు. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఐతే పవన్ మాజీ భార్య రేణూ దేశాయ్ మాత్రం పవన్ బర్త్ డే స్పెషల్ సందర్భంగా తమ కుమార్తె ఆద్య ఓ కోర్కెను వెలిబుచ్చినట్లు ట్వీట్ చేశారు.

కొన్ని రోజులుగా పవర్ స్టార్ ఫోటోలను షేర్ చేస్తూ వచ్చారు ఆయన మాజీ భార్య రేణూ దేశాయ్.. ఇవాళ ఆమె ఏం ట్వీట్ చేస్తారో అని అంతా ఆసక్తి గా చూశారు. ఆమె పెట్టిన ట్వీట్ ఏంటో తెలుసా? పవన్ కు, తనకు పుట్టిన బిడ్డ ఆద్య అన్న ఓ మాట ను షేర్ చేశారామె..

“అమ్మా.. ఇవాళ నాన్న పుట్టిన రోజు. నాన్న ఫోటోను నీ ఫోన్లో పైన పెట్టు అని కోరింది.. ఆద్య సంతోషం కోసం నేను ఇవాళ నా డిపి (డిస్ ప్లే పిక్చర్) ని మార్చి పవన్ ది పెట్టాను” అని రేణూ వివరించారు.

Renu Desai

పవన్ నుంచి విడిపోయినా రేణూ దేశాయ్ మాత్రం పవన్ కు సంబంధించిన అనేక విషయాల్ని షేర్ చేస్తూనే వచ్చారు. తాను నిత్యం పవన్ తో టచ్ లో ఉన్నట్లు కూడా చెప్పారు. పవన్ కు, తనకు పుట్టిన కొడుకు అకీరా నటించిన సినిమా ను కూడా ఆమె విడుదల చేస్తున్నారు. పవన్ తో జీవితాన్ని మర్చిపోలేకపోతున్నానని ఓ సందర్భంలో అన్న రేణూ ప్రస్తుతం పుణెలో ఉంటున్నారు.

ఇకపోతే పవన్ కళ్యాణ్ తన పుట్టినరోజు నాడు ఏం చేస్తున్నారు.. ఎక్కడ ఉన్నారనేది సస్పెన్స్. ఐతే ఆయన తన పుట్టినరోజును చాలా సాధారణంగా గడిపేస్తారనీ, తన పిల్లలతోనే ఎక్కువగా సమయాన్ని గడిపేస్తారని చెప్పుకుంటారు. కాగా పవన్ కళ్యాణ్ తన ఫ్యాన్స్ కోసం తను నటించబోయే తదుపరి చిత్రం కాటమరాయుడు అని మాత్రం వెల్లడించారు. దీనితో ఫ్యాన్స్ ఖుషీ అయిపోయారు.

మొదట నందని అనే అమ్మాయిని, తరువాత రేణూ దేశాయ్ ని పెళ్ళి చేసుకుని వదిలేసిన పవన్ అనంతరం అన్నా లెజెనోవా అనే రష్యన్ ను పెళ్ళాడారు. పొలేనా అనే కూతురు ఉన్న అన్నా తొలిసారిగా పవన్ కు తీన్ మార్ షూటింగ్ సమయంలో 2011 లో పరిచయమయ్యారు.

- Advertisement -