మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టన కేంద్రంలోని జడ్పిహెచ్ఎస్ హైస్కూల్‌లో వెయ్యి మంది నిరుపేద కుటుంబాలకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు నిత్యావసర సరుకుల పంపిణీ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ట్రాలలో పంటలకు కనీస మద్దతు ధర ఇవ్వట్లేదు. కరోనా కష్టకాలంలో కూడా రైతులను ఆదుకున్న మహాత్ముడు సీఎం కేసీఆర్ అని తెలిపారు.
ఇలాంటి ఆపత్కాల సమయంలో కూడా కాంగ్రెస్, బీజేపీలు నీచ రాజకీయాలు చేస్తున్నాయి.దేశంలోనే కరోనా కట్టడిలో తెలంగాణ రాష్ట్రం ముందుంది. సీఎం కేసీఆర్ చర్యల వల్లనే కరోనా వైరస్ కట్టడిలో ఉంది.రైతులను రాజుగా చూడాలనేదే సీఎం కేసీఆర్ ధ్యేయం.రైతులకు మొదటి విడతలో ఇరవై అయిదు వేళా రూపాయల రుణ మాఫీ చేసిన గొప్ప వ్యక్తి సీఎం కేసీఆర్ కొనియాడారు.
కరోనా కష్టకాలంలో రైతు బంధు ఇచ్చిన మహాత్ముడు సీఎం కేసీఆర్.రైతుల పక్షపాతి సీఎం కేసీఆర్. రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీలు దిక్కుమాలిన రాజకీయాలు చేస్తున్నాయన్నారు.కరోనా ఒక మహమ్మారి,దీనికి మందు లేదు.ప్రతిఒక్కరూ తప్పకుండా సామాజిక దూరాన్ని పాటించాలి. తప్పకుండా మాస్కులు ధరించాలని మంత్రి ఎర్రబెల్లి సూచించారు.