- Advertisement -
రైల్వే శాఖ మంగళవారం నుంచి ప్రజల కోసం కొన్ని రైళ్లను నడపాలని నిర్ణయించింది.మొత్తం 15 జతల రైళ్లు, న్యూఢిల్లీ, ముంబయి, బెంగళూరు, చెన్నై, సికింద్రాబాద్, విజయవాడ తదితర నగరాల మధ్య తిరగనున్నాయి. ప్రయాణికుల రైళ్ల ప్రారంభం నేపథ్యంలో కేంద్ర హోంశాఖ ప్రామాణిక నిబంధనలను విడుదల చేసింది.
ప్రామాణిక నిబంధనలు ఇవే..
- ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖతో సంప్రదించి రైళ్ల రవాణాను రైల్వే మంత్రిత్వ శాఖ గ్రేడెడ్ పద్ధతిలో అనుమతించాలి.
- రైలు షెడ్యూల్, ప్రయాణీకుల బుకింగ్, ప్రవేశం, ప్రయాణికుల కదలికలు, కోచ్ సేవలు రైల్వే మంత్రిత్వ శాఖ విస్తృతంగా ప్రచారం చేయాలి.
- ధృవీకరించిన ఈ-టిక్కెట్లు ఉన్న ప్రయాణీకులను మాత్రమే స్టేషన్‌లోకి అనుమతించాలి.
- ఈ-టికెట్ ఆధారంగా ప్రయాణీకుల కదలికలతో పాటు రైల్వే స్టేషన్‌కు ప్రయాణీకులను రవాణా చేసే వాహనం యొక్క డ్రైవర్ కు అనుమతి.
- రైలు స్టేషన్లలో ప్రయాణీకులందరూ తప్పనిసరిగా స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించాలి.
- కరోనా లక్షణాలు లేని ప్రయాణీకులను మాత్రమే రైలు ప్రయాణానికి అనుమతి.
- ప్రయాణీకులందరికీ స్టేషన్ మరియు కోచ్ ప్రవేశ, నిష్క్రమణ పాయింట్ల వద్ద హ్యాండ్ శానిటైజర్ అందించాలి.
- ప్రయాణీకులందరూ ప్రవేశ సమయంలో, ప్రయాణ సమయంలో ఫేస్ మాస్క్ లు ధరించాలి.
- బోర్డింగ్, ప్రయాణ సమయంలో ప్రయాణీకులందరూ సామాజిక దూరాన్ని పాటించాలి.
- ప్రయాణీకుల కోసం ఇన్ఫర్మేషన్, ఎడ్యుకేషన్ అండ్ కమ్యూనికేషన్ ప్రచారం ద్వారా ఆరోగ్య సలహాలు, మార్గదర్శకాలు అందించాలి.
- ప్రయాణికులు వారి గమ్యస్థానానికి చేరుకున్నప్పుడు ఆ రాష్ట్రం సూచించిన ఆరోగ్య నియమాలకు కట్టుబడి ఉండాలి.
- Advertisement -