- Advertisement -
ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతూనే ఉంది. ఇప్పటివరకు 41,00,623 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా 2,80,431 మంది మృతిచెందారు. 14,39,916 మంది కోలుకుని డిశ్చార్జి కాగా 23,80,276 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు.
అగ్రరాజ్యమైన ఆ దేశంలో కరోనా కేసులు 13,47,309కి పెరిగాయి. నిన్న ఒక్కరోజే ఈ వైరస్ ప్రభావంతో 1422 మంది మృతిచెందారు. ఇటలీలో 2,18,268 కరోనా పాజిటివ్ నమోదుకాగా 30,395 మరణించారు.
ఇక భారత్లో కరోనా కేసులు రోజురోజుకి రెట్టింపు అవుతున్నాయి.గడిచిన 24 గంటల్లో దేశంలో 3,320 కరోనా కేసులు నమోదుకాగా మొత్తం కేసుల సంఖ్య 59,662కు చేరుకుంది. ఇప్పటివరకు 1,981 మంది మృతిచెందారు.
- Advertisement -