ఖమ్మంలో లాక్ డౌన్ సమయంలో ప్రభుత్వం ఇచ్చిన సడలింపులను ప్రజలు ఉపయోగించుకోవాలని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. ఈరోజు ఖమ్మంలో ఆయన లాక్‌డౌన్ సడలింపుల నేపథ్యంలో మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 28 ఏప్రిల్ తర్వాత అంటే గడచిన 15 రోజులుగా ఖమ్మంలో కేసులు నమోదు కాలేదు. గ్రీన్ జోన్‌లో కూడా ఆర్టీసీ బస్సులు తిరగవు.అన్ని రకాల షాపులు ఓపెన్ చేసుకోవచ్చు..సరి, బేసి సంఖ్యల ప్రకారం షాపులు రోజు విడిచి రోజు తెరవాలి. అత్యవసర,నిత్యవసరాలు ఎప్పుడూ తెరచి ఉంటాయని మంత్రి తెలిపారు.
అయితే ఎక్కడైనా మాస్క్ తప్పని సరి చేయాలని, భౌతిక దూరం పాటించాలని అన్నారు.ప్రభుత్వ కార్యాలయాలు అన్ని పని చేస్తాయి.ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలు కరోనా కష్టం నుంచి బయటపడినట్టే అన్నారు. ప్రభుత్వ నిర్ణయం చేసే వరకు ఆర్టీసీ బస్సులు తిరగవు. వలస కూలీలను స్వరాష్ట్రాలకు పంపుతున్నాం. కరోనాపై పోరాటంలో మీడియ పనితీరుకు ధన్యవాదాలు తెలిపారు. ప్రస్తుతం ఖమ్మంలో జిల్లాకు చెందిన ఇద్దరు మాత్రమే కరోనా చికిత్స పొందుతున్నారు. మిగతావారంతా డిశ్చార్జ్ అయ్యారు. మే -29 వరకు లాక్ డౌన్ నిబంధనలు పాటించాలి. కరోనాను కట్టడి చేస్తూనే.. సహజీవనం చేయాలి అని మంత్రి పేర్కొన్నారు.