- Advertisement -
తెలంగాణ కేబినెట్ సమావేశం నేడు జరగనుంది. ప్రగతిభవన్లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో లాక్ డౌన్ కొనసాగించాలా లేదా అన్నదానిపై కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.
తెలంగాణలో మే 7న లాక్ డౌన్ ముగియనుంది. ఇక తెలంగాణలో మే 8 నాటికి కరోనా తగ్గుముఖం పడుతుందని ప్రభుత్వం ధీమాగా ఉన్న నేపథ్యంలో దశల వారీగా లాక్ డౌన్ ఎత్తివేతపై నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. దీనికి తోడు కేంద్రం ఇచ్చిన సడలింపులు అమల్లోకి రావడంతో వీటిపై చర్చించి నిర్ఱయం తీసుకోనున్నారు.
రాష్ట్రంలో 11 జిల్లాలు కరోనా ఫ్రీగా ఉండటం…కేంద్రం రెడ్,ఆరెంజ్,గ్రీన్ జోన్ల వివరాలను ప్రకటించిన నేపథ్యంలో దశల వారీగా లాక్డౌన్ను ఎత్తివేసే అంశాన్ని పరిశీలించనున్నట్లు తెలుస్తోంది. దీనికి తోడు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
- Advertisement -