- Advertisement -
టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి నేటికి ఇరవై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్. పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా సూర్యపేట లోని తన నివాసం ఇంటిపై పార్టీ జెండా ఎగురవేసి శుభాకాంక్షలు తెలిపిన బడుగుల.
తెలంగాణకు జరుగుఉన్న అన్యాయాన్ని ప్రజలకు వివరిస్తూ, కలిసి వచ్చిన ప్రతీ ఒక్కరిని అక్కున చేర్చుకొని కదం తొక్కిన అధినాయకుడు కేసీఆర్ అని కొనియాడారు.
14 యేండ్లు ఏకధాటిగా పోరాడి చివరికి చావు చివరి అంచు వరకు వెళ్లి జూన్-2 న స్వరాష్ట్రాన్ని అధికారికంగా సాధించి, నాలుగున్నర కోట్ల తెలంగాణా ప్రజల ఆకాంక్షను నెరవేర్చిన ఘనుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు నుండి ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ,బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం నిరంతరం పనిచేస్తున్న టిఆర్ఎస్ పార్టీయే ప్రజలకు శ్రీరామ రక్ష అని అన్నారు.
- Advertisement -