- Advertisement -
కరోనా వైరస్ నుండి కోలుకున్నారు బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్. ఓ దశలో పరిస్ధితి క్షిణించి ఐసీయూలో చేరిన బోరిస్ తాజాగా పూర్తిగా కొలుకుని తిరిగి డ్యూటీలో చేరేందుకు సిద్ధమయ్యారు.
సోమవారం నుండి తిరిగి విధులకు హాజరుకానున్న బోరిస్…దేశంలో కరోనా పరిస్ధితులపై రివ్యూ చేయనున్నారు. బ్రిటన్లో ఇప్పటివరకు 20 వేల 377 మంది మరణించగా, లక్ష 48 వేల 377 మంది వైరస్ సోకింది. ఈ నేపథ్యంలో వ్యాధి బారిన పడ్డవారు భయపడకుండా దానిని ఎదుర్కోవాలని సూచించారు బోరిస్.
తనకు వైద్యం అందించిన వైద్య సిబ్బందికి రుణపడి ఉంటానని చెప్పారు. ఇప్పటివరకు బ్రిటన్లో పరిస్ధితిని విదేశాంగ మంత్రి డొమినిక్ రాబ్ సమీక్షిస్తుండగా రేపటి నుండి బోరిస్ తన విధులు నిర్వర్తించనున్నారు.
- Advertisement -