మటన్‌ షాపులను తనిఖీచేసిన ఎమ్మెల్యే మర్రి..

272
marri
- Advertisement -

నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో పలు కిరణం షాప్ లను,మటన్ షాప్ లను ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి,ఆకస్మికంగా తనిఖీ చేశారు,ఈ సందర్భంగా కిరణం షాప్ ల దగ్గర ఏర్పాట్లను పరిశీలించారు,ధరల పట్టికను పరిశీలించారు, అధిక ధరలకు అమ్మొద్దు అని సూచించారు,వినియోగదారులు సామాజిక దూరం పాటించే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు.

శానీటైజర్స్ ఏర్పాటు చేయాలి అని కిరణం షాప్ యజమానులకు ఆదేశించారు, అనంతరం మటన్ షాప్ దగ్గర వెళ్లి అక్కడ పరిశీలించి కొంత అసంతృప్తి వ్యక్తం చేశారు, షాప్స్ దగ్గర ప్రత్యేకంగా సామాజిక దూరం పాటెంచే విధంగా గుర్తులు ఏర్పాటు చేసి అందులో నిలబడి ఒకరి తర్వాత ఒకరికి అందజేయాలి అని సూచించారు, షాప్ దగ్గర పరిశుభ్రంగా ఉంచుకోవాలి అని ఆదేశించారు.

అధిక రేట్లకు మటన్ అమ్మితే కఠిన చర్యలు తీసుకోవాలని అని మున్సిపల్ కమిషనర్ ను ఆదేశించారు,అనంతరం షాప్స్ దగ్గర మాస్కులు లేనివారికి మాస్కులను ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి అందజేశారు.

- Advertisement -