గచ్చిబౌలి లో ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన కోవిద్ 19 ఆసుపత్రిని తనిఖీ చేసింది కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రతినిధి బృందం. గచ్చిబౌలిలోని స్పోర్ట్స్ విలేజ్ లో కరోనా ఐసోలేషన్ కేంద్రానికి గాను ప్రత్యేకంగా 1500 పడకల ఆసుపత్రి ఏర్పాటు ఈ కేంద్ర బృందం లో భారత ప్రభుత్వ జల శక్తి శాఖ అడిషనల్ సెక్రటరీ అరుణ్ బరోకా, పబ్లిక్ హెల్త్ సీనియర్ స్పెషలిస్ట్ డాక్టర్ చంద్రశేఖర్ , నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ డైరెక్టర్ డాక్టర్ హేమలత, జాతీయ కన్జ్యూమర్ ఆఫ్ఫైర్ మంత్రిత్వ శాఖ డైరెక్టర్ ఎస్. ఎస్. ఠాకూర్, నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అసోసియేట్ ప్రొఫెసర్ శేఖర్ చతుర్వేది.
కేంద్ర బృందానికి ఈ ప్రత్యేక ఆసుపత్రిలో చేసిన ఏర్పాట్లను వివరించిన పంచాయతీ రాజ్ శాఖ కమిషనర్ రఘునందన్ రావు, రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ ప్రతీక్ జైన్, ఆరోగ్య శాఖ సంచాలకులు డాక్టర్ రమేష్, జిహెచ్ఎంసి జోనల్ కమిషనర్ రవి కిరణ్ తదితరులు.
ఈ ప్రత్యేక ఆసుపత్రిలో టెస్టింగ్ కిట్లు, వ్యక్తిగత రక్షణ పరికరాలు, మాస్కులు సేవల అందుబాటు గురించి అధికారులతో సమీక్షించారు.ఈ ప్రత్యేక ఆసుపత్రిలో కంటైంన్మెంట్ ప్రణాళికలను పరిశీలించారు. కేంద్ర బృందం తెలంగాణ క్షేత్రస్థాయిలో కోవిద్ నియంత్రణకు తీసుకుంటున్న చర్యలను సమీక్షించారు.