కేటీఆర్ సరదా ట్వీట్…సోషల్ మీడియాలో వైరల్

323
ktr
- Advertisement -

తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ కు సోషల్ మీడియా ట్విట్టర్ లో ఓ యువకుడు కొత్త ప్రశ్న అడిగాడు. అందుకు కేటీఆర్ కూడా తనదైన శైలిలో సమాధానమిచ్చారు. ఇంతకీ ఆ యువకుడు ఏం అడిగాడు? మంత్రి ఏం సమాధానం చెప్పారో ఓ సారి చదవండి..

సిద్దిపేట జిల్లాలో కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన రంగనాయక సాగర్‌ జలాశయం మోటార్ స్విచ్ ఆన్ చేసి గోదావరి నీటిని విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా రిజర్వాయర్ నిర్మించిన కూలీలు.. ఇంజనీర్లను సన్మానించటం.. వారితో కలిసి సహపంక్తి భోజనం చేశారు కేటీఆర్. ఈ సందర్భంగా కేటీఆర్ ..కూలీలతో కలిసి తింటున్న ఫోటోను షేర్ చేసిన ఓ నెటిజన్ మీ జుట్టు నెరిసినట్టుంది…అది తాను జీర్ణించుకోలేక పోతున్నానని తెలపగా కేటీఆర్ సైతం తనదైన శైలీలో సరదాగా స్పందించారు. నా జుట్టు అసలు రంగు ఇదే కావచ్చు అంటూ కామెంట్ చేశారు.

ktr

- Advertisement -