పంజాగుట్ట స్మశాన వాటికను సందర్శించిన తలసాని

259
talasani
- Advertisement -

రోడ్డు విస్తరణలో భాగంగా స్థలం కోల్పోతున్న పంజాగుట్ట స్మశాన వాటిక కు ప్రత్యామ్నాయ స్థలాన్ని కేటాయించేందుకు శాయశక్తులా కృషి చేస్తానని పశుసవర్ధక, మత్స్య, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శనివారం పంజాగుట్ట స్మశాన వాటికను మేయర్ బొంతు రాంమోహన్, mla దానం నాగేందర్, mlc ప్రభాకర్, కార్పొరేటర్ మన్నే కవితా రెడ్డి లతో కలిసి సందర్శించారు. ముందుగా మాసాబ్ ట్యాంక్ లోని పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ కార్యాలయ ఆవరణలోని కార్యాలయంలో mlc ప్రభాకర్ ఆధ్వర్యంలో ఖైరతాబాద్ గంటపుత్ర సంఘం కమిటీ సభ్యులు మంగళపల్లి రాజు, మహేందర్, నాగేష్, రాంమూర్తి, నవనీదర్ లు మంత్రి శ్రీనివాస్ యాదవ్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు.

ట్రాఫిక్ రద్దీ దృష్ట్యా రోడ్డు విస్తరణలో స్థలాన్ని కోల్పోతున్న తమకు ghmc అధికారులు ప్రత్యామ్నాయంగా 3 వేల గజాల స్థలం, నీటి సౌకర్యం కల్పిస్తామని తెలిపారని, కాని మాకు న్యాయం చేయకుండానే నిర్మాణ పనులు అధికారులు చేపట్టారని మంత్రికి వివరించారు. స్పందించిన మంత్రి వెంటనే పంజాగుట్ట స్మశాన వాటిక ను సందర్శించి 17 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న వంతెన పనులను పరిశీలించారు. అదేవిధంగా ప్రధాన రహదారిపై జరుగుతున్న bt రోడ్డు పనులను కూడా పరిశీలించారు.

- Advertisement -