జయలలిత ఆసుపత్రిలో చేరినప్పటి నుంచి ఇప్పటీ వరకు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఆమెను చూడడానికి వచ్చిన పలువురు ప్రముఖులను కూడా చూడానివ్వకూడా వెనక్కి తిప్పి పంపిచేశారు. అసలు అమ్మ అనారోగ్యనికి కారణం ఏంటి. అమ్మకు ఎలాంటి చికిత్స ఇచ్చారు. వారం రోజులో డిశ్చార్జ్ కావచ్చు అని చెప్పిన డాక్టర్లే వారం తర్వాత అమ్మ పరిస్థితి సీరియస్ అని మరికొన్ని రోజులపాటు ఆసుపత్రిలో ఉంచుకున్నారు. దాని తదనంతరం అమ్మ మరణించింది.దీనిపై అనేక అనుమానాలు ప్రజల్లో, జయ అభిమానుల్లో వ్యక్తమవుతున్నాయి.
సోషల్ మీడియాలో అమ్మ మృతిపై ఇటీవలే కొన్ని వార్తలు కూడా చక్కర్లు కొడుతున్నాయి. అమ్మ చెప్పపై గాయాలు, మరొకరు తన కాలు తీసారని ఇలా రకరకల వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి దీనిపై నిజలు తెలియాల్సి ఉంది.
అయితే జయ మృతిపై మద్రాస్ హైకోర్టు సందేహాలు వ్యక్తంచేసింది. ఆమె మృత దేహాన్ని ఎందుకు బయటకు తీయకూడదో చెప్పాలని అపోలో హాస్పిటల్, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. మీడియా ఆమె మృతిపై చాలా అనుమానాలు లేవనెత్తింది. వ్యక్తిగతంగా నాకు కూడా సందేహాలు ఉన్నాయి అని న్యాయమూర్తి జస్టిస్ వైద్యలింగం అన్నారు. జయలలిత మృతిపై విచారణకు ఆదేశించాల్సిందిగా కోరుతూ దాఖలైన పిటిషన్‌పై కోర్టు విచారణ జరిపింది.
జయలలితను ఆసుపత్రిలో అడ్మిట్ చేసిన సమయంలో ఆమె మంచి ఆహారం తీసుకుంటున్నారని చెప్పారు. కనీసం ఇప్పుడు ఆమె చనిపోయిన తర్వాతైనా నిజమేంటో తెలియాలి అని న్యాయమూర్తి విచారణ సందర్భంగా వ్యాఖ్యానించారు. ఈ కేసుకు సంబంధించి సమగ్ర ఆరోగ్య నివేదికను సమర్పించాలని కోర్టు ఆదేశించింది. 75 రోజుల పాటు అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందిన తర్వాత డిసెంబర్ 5న జయలలిత మృతి చెందిన విషయం తెలిసిందే. ఆమె కోలుకున్నారని చెప్పిన కొద్ది గంటల తర్వాత సడెన్‌గా గుండెపోటు వచ్చిందని ఆసుపత్రి వర్గాలు చెప్పాయి. ఆ తర్వాత కొద్ది గంటల వ్యవధిలోనే జయలలిత మృతిచెందారు.