ప్లాస్మా థెరపీ… సంజీవనా..!

527
coronavirus
- Advertisement -

ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే మాట. దశాబ్దాలుగా మనుగడలో ఉన్నా… ఈ పదానికి బాగా ప్రాచుర్యం కలిగింది మాత్రం గత నెలరోజులుగానే . భారత్ సహా వివిధ దేశాల ఆశలన్నీ ప్రస్తుతం ఈ థెరపీపైనా ఉన్నాయి. కరోనాని ఎదుర్కొనేందుకు ప్రభుత్వాలు ప్లాస్మాథెరపీని వజ్రాయుధంగా భావిస్తున్నాయి. మరి ఇంతకీ ఈ ప్లాస్మా థెరపీ అంటే ఏమిటి. కరోనాను ఎదుర్కొనేందుకు ఇది ఇలా ఉపయోగపడుతుంది. ప్లాస్మా థెరపీ నిజంగా సంజీవని వంటిదేనా. భారీ సంఖ్యలో పెరుగుతున్న రోగులకు ప్లాస్మా థెరపీ నిర్వహించటం సాధ్యమేనా అన్న విశేషాలు ఇప్పుడు చూద్దాం..

ప్రపంచం మొత్తం కరోనాకు వ్యక్సిన్ కోసం ఎదురుచూస్తోది… కానీ ప్రస్తుత పరీస్థితుల్లో వాక్సిన్ ని అందుబాటులోకి తీసుకురావటం ఒక్క రోజులో పని కాదు. అందుకు భారీగా పరిశోధనలు జరగాలి. కనీసం ఏడాది రెండేళ్లు పట్టే అకాశం ఉందని పలువురు శాస్త్రవేత్తలు చెబతుున్న నేపథ్యంలో గుడ్డిలో మొల్ల నయం అన్న చందంగా ప్రస్తుంత ప్రపంచానికి ప్లాస్మా థెరపీపైనా ఆశలు పెట్టుకుంది. చైనాలో ప్లాస్మా థెరపీ మెరుగైన ఫలితాలు ఇచ్చిన నేపథ్యంలో సౌత్ ఆఫ్రిక, అమెరికా, యూకే వంటి దేశాలు ఈ చికిత్స పై ఆశలు పెట్టుకున్నాయి. అందుకు తగిన ప్రయోగాలను వేగవంతం చేశాయి. ఇదే అడుగుజాడల్లో నడుస్తున్న భారత్…. క్లినికల్ ట్రయల్స్ చేసేందుకు ఉపక్రమించింది. అయితే ఈ ట్రయల్స్ ఇన్ స్టిట్యూషనల్ ఎథిక్స్ కమిటీ ప్రొటోకాల్ ప్రకారమే చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా క్లినికల్ ట్రయల్స్ చేయాలనుకునే వారు ముందుగా క్లినికల్ ట్రయల్ రిజిస్ట్రీ ఆఫ్ ఇండియా లో రిజిస్టర్ చేసుకోవాలి. డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా నుంచి అనుమతి పొందాల్సి ఉంటుంది. కేరళలోని ది శ్రీ చిత్ర తిరునాల్ ఇన్ స్టిట్యూట్ ఫర్ మెడికల్ సైన్స్ అండ్ టెక్నాలజీ లో ఈ పరీక్షలు చేసేందుకు ఈ నెల 11న ఐసీ ఎంఆర్ అనుమతి ఇచ్చింది..

సాధారణంగా మనిషి శరీరంలోకి ఏదైనా వైరస్ బ్యాక్టిరియా వంటివి ప్రవేశించినప్పుడు శరీరంలో ఉండే సహజ రక్షణ విభాగం యాంటీ బాడీలను విడుదల చేసి ఆయా క్రిములను చంపేస్తుంది. దీనినే ఇమ్యునిటీ అంటాం. అయితే కరోనా నేరుగా ఇమ్యునిటీ మీదే పనిచేస్తోందని ఫలితంగా దీనికి తగిన యాంటీ బాడీలు తయారువటం కాస్త ఇబ్బందిగా మారుతోంది. అయితే వ్యాధి నుంచి కోలుకున్న వ్యక్తి రక్తంలో కరోనాను ఎదుర్కొనే యాంటీ బాడీలు తయారయ్యి ఉంటాయి. వాటిని సేకరించి రోగి శరీరంలోకి పంపినప్పుడు 3 నుంచి 5రోజుల్లోపే వ్యాధి నుంచి కోలుకునే అవకాశం ఉంది. దీనినే ప్లాస్మా థెరపీ అంటారు. కోలుకున్న వ్యక్తి రక్తాన్ని సేకరించి.. అందలో ఉన్న యాంటీ బాడీలను వేరి చేసి.. ప్రస్తుతం వ్యాధితో తీవ్రంగా బాధిస్తున్న వారికి సహజంగా ఈ యాంటీ బాడీలను ఇంజెక్ట్ చేస్తారు. అయితే ఇదేం ఇప్పుడు కొత్తగా వచ్చింది కాదు. దశాబ్దాలుగా అందుబాటులో ఉన్న విధానమే. 1890లలో మొట్టమొదటి సారి సీరమ్ తో ఈ రకం చికిత్స చేయవచ్చని జర్మనీ కి చెందిన వైద్యుడు కనుగొన్నారు. ఇందుకు గాను ఆయన నోబుల్ ప్రైజ్ అందుకున్నారు. డిఫ్తీరియా సోకిన కుందేలు రక్తం నుంచి సీరమే ని సేకరించి మనుషులకు ఇవ్వటం ద్వారా డిఫ్తీరియాను తగ్గించవచ్చని ఆయన గుర్తించారు. ఇదే తరహా చికిత్సలను గత దశాబ్దాలుగా అనేక రకాల మహమ్మారులను నిర్మూలించేందుకు వినియోగించారు. స్మానిష్ ఫ్లూ, 1920లో డిఫ్తీరియా, 1930 ఫ్లేష్ ఈటింగ్ బ్యాక్టీరియా ప్రబలినప్పుడు ఈ తరహా సీరమ్ తో చికిత్స చేసేవారు. అయితే అందులో ఏనేక రకాల సైడ్ ఎపెక్స్ట్ ఉండేవి. ఆ తర్వాత చాలా కాలానీకి యాంటీ బాడీస్ ని వేరు చేయటం వాటిని రోగి శరీరంలోకి ప్రవేశపెట్టే ప్రక్రియ ప్రారంభమైంది. సార్స్, మెర్స్, సహ… అబోలా సోకినప్పుడు సైతం ఈ తరహా చికిత్సను వినియోగించినట్టు పలువురు వైద్యులు చెబుతున్నారు…

అయితే ప్లాస్మా సేకరణలో కొన్ని అడ్డంకులు ఉన్నాయి. ఆరోగ్యకరమైన వాలంటీర్ దాతల నుండి రక్తం మరియు ప్లాస్మాను సేకరించడానికి కొన్ని ప్రస్తుతం బ్లడ్ బ్యాంకులు అనుసరిస్తున్న జాతీయ మార్గదర్శకాలు ఉన్నాయి. దాతల ఎంపిక మార్గదర్శకాల ప్రకారం కోలుకున్న రోగులు దానం చేయడానికి అర్హులు కాదు. కొవిడ్ 19 నుంచి కోలుకున్న వ్యక్తి 28 రోజులు పూర్తయి ఉండాలి. ప్లాస్మా సేకరణకు అది కనీస సమయ వ్యవధిగా వైద్యులు చెబుతున్నారు. డోనర్ వయసు 18 నుంచి 50 ఏండ్ల మధ్య ఉండాలి. బరువు 50 కేజీల కంటే ఎక్కువ ఉండాలి. గుండె.. కిడ్నీ, శ్వాస సంబంధ వ్యాధులు ఉండొద్దు రక్తాన్ని సేకరించే ముందు డోనర్ అంగీకారం తప్పనిసరిగా తీసుకోవాలి. వారి రక్తంలో హీమోగ్లోబిన్ కనీసం 12.5 పాయింట్లు, అంతకంటే ఎక్కువగా ఉండాలి. డోనర్ నుంచి ఒకసారి 350 మిల్లీ లీటర్ల రక్తాన్నిమాత్రమే సేకరించాలి. అవసరమైతే 48 గంటల తర్వాత మళ్లీ అదే డోనర్ నుంచి మరో 350 మిల్లీ లీటర్లు తీసుకోవచ్చు. డొనేషన్ టైమ్‌లో బి.పి కనీసం 100/60 నుంచి 150/90 మధ్య ఉండాలి. వారికి గత ఆరు నెలల్లో ఎలాంటి ఆప రేషన్లు జరిగి ఉండకూడదు. శ్వాస సంబంధ వ్యాధులు, గుండె, కిడ్నీ జబ్బులు ఉండకూడదు. అలాగే డోనర్, పేషెంట్ బ్లడ్ గ్రూప్ కూడా కలవాల్సి ఉంటుంది. ప్లాస్మా చికిత్స పొందే గ్రహీతకు కూడా మార్గదర్శకాలు ఉన్నాయి. వైరస్‌తో తీవ్ర అనారోగ్యం పాలైనవారికి మాత్రమే ప్లాస్మా థెరపీ చేస్తారు.

ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలోనూ ప్రయోగాలు చేసేందుకు అనుమతులను సాధించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఏడుగురు వైద్యుల బృందం తో కూడిన ఎథికల్ కమిటీని ఏర్పాటు చేసింది. ఐసీఎంఆర్ , ఎథికల్ కమిటీల నుంచి వీలైనంత త్వరగా ప్లాస్మా థెరపీ క్లినికల్ ట్రయల్స్ కి అనుమతులు తీసుకువచ్చేందుకు కావాల్సిన అన్ని ప్రక్రియలను పూర్తి చేయాలని కమిటీ సభ్యులను కోరింది. రాష్ట్రంలో కోలుకున్న వారి సంఖ్య 180కి పైగా ఉండటం తోపాటు.. సీసీఎంబీ వంటి ల్యాబ్ లు అందుబాటులో ఉన్న తరుణంలో ఈ తరహా ప్రయోగాలను చేస్తే రోగులకు వీలైనంత త్వరగా చికిత్స అందించవచ్చని భావిస్తోంది.

- Advertisement -