రాష్ట్రంలో కొత్తగా 50 కరోనా పాజిటివ్ కేసులు..

192
etela
- Advertisement -

తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు క్రమంతగా పెరుగుతున్నాయి. ఈ రోజు మరో 50 ‘కరోనా’ పాజిటివ్ కేసులు నమోదయ్యాయని, ఈ కేసులతో సహా ఇప్పటి వరకు మొత్తం 700 కేసులు నమోదైనట్టు మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. వీటిలో 90శాతం కేసులు ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోనే నమోదయ్యాయని ఆయన తెలిపారు. ఇవాళ కరోనాతో ఎవరూ చనిపోలేదని చెప్పారు ఈటల. మరో 68 మంది వ్యాధి నుంచి కోలుకున్నారని.. వారందరినీ డిశ్చార్జ్ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని వెల్లడించారు.

జీహెచ్ఎంసీ పరిధిలో ప్రస్తుతం 240 యాక్టివ్ కరోనా కేసులు ఉండగా..134 మంది డిశ్చార్జి అయ్యారు. ఇప్పటి వరకు పది వేల మందికి వైద్య పరీక్షలు నిర్వహించామని, హైదరాబాద్ లో ఈరోజు 800 నమూనాలు పరీక్షించినట్టు చెప్పారు. నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల్లో ఎక్కువ మంది ఢిల్లీలోని మర్కజ్ కు వెళ్లొచ్చిన వారేనని చెప్పారు.

- Advertisement -