నయనానందకరం ఆమె రూపం. నటనానందకరం ఆమె నటన. అటు గ్లామర్ రోల్స్ లో నయా డ్రస్సులతో ఎట్రాక్ట్ చేసినా…. నార చీరలు కట్టి భక్తిపారవశ్యాన్ని ఒలికించినా..అమ్మడికే సొంతం. ఇంతకీ నయనతార. అందం, అభినయం, అదృష్టం.. ఈ మూడూ కలిస్తే నయన్. కేవలం తెలుగులోనే కాదు తమిళ, మలయాళం భాషలలో తనకంటూ ఓ క్రేజ్ క్రియేట్ చేసుకుని ముందుకుసాగుతోన్న నయన్…తన జీవితంలో చేదు జ్ఞాపకాలను రివీల్ చేసింది.
తమిళ దర్శకుడు విఘ్నేశ్ శివన్‌తో డేటింగ్లో ఉన్న నయన్…త్వరలో వివాహం చేసుకోబోతోంది. ఈ సందర్భంగా శింబు, ప్రభుదేవాలతో లవ్ బ్రేకప్ గురించి చెప్పుకొచ్చింది.
ప్రతి ఒక్కరి జీవితంలో తొలి ప్రేమ అనేది ఎంత మధురానుభూతిని మిగులుస్తుంది. కానీ తన జీవితంలో బాధను మిగిల్చిందని తెలిపింది. నమ్మకం లేని చోట ప్రేమ నిలవదు…..అందుకే కలిసి జీవించడం కన్నా విడిపోవడమే మంచిదనే అభిప్రాయంతో వారితో నా బంధాన్ని వదులుకున్నాను అని నయనతార చెప్పుకొచ్చారు.