ఉపాధి కూలీల చైతన్యానికి హ్యాట్సాఫ్‌: ఎర్రబెల్లి

312
minister errabelli
- Advertisement -

ఆదిలాబాద్ జిల్లా ముఖ్ర‌కే గ్రామంలో సామాజిక దూరాన్ని పాటిస్తు ఉపాధి కూలీలకు హ్యాట్సాఫ్ చెప్పారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. ఈ ఉపాధి హామీ కూలీలు అంద‌రికీ ఆద‌ర్శం!…మీ అవ‌గాహ‌న‌, చైత‌న్యానికి హ్యాట్సాఫ్‌ అంటూ ఫేస్ బుక్ వేదికగా కొనియాడారు.

ముఖ్రకే గ్రామంలో ఉపాధి హామీ కూలీలు అందరికీ ఆదర్శంగా నిలిచారని ప్రశంసించారు. వీరిని ఆదర్శంగా తీసుకుని రాష్ట్రంలోని ప్రజలు బౌతిక దూరం పాటించాలని కరోనా పీడను తరిమికొట్టాలని పిలుపునిచ్చారు.

పల్లె ప్రగతి, హరితహారం, బియ్యం పంపిణీలో, డిజిటల్‌ గ్రామంగా, దళితులకు భూపంపిణీ కార్యక్రమాల్లో కూడా గ్రామం అందరికంటే ముందుందని, గ్రామస్తులు సంఘటితంగా కొనసాగుతున్నారని కొనియాడారు.

- Advertisement -