స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ హ్యాట్రిక్ కాంబినేషన్లో, మైత్రీ మూవీ మేకర్స్, ముత్తంశెట్టి మీడియా సంయుక్త నిర్మాణంలో రూపొందుతున్న క్రేజీ ప్యాన్ ఇండియా మూవీ ఇటీవలే పూజా కార్యక్రమాలతో మొదలైన సంగతి తెలిసిందే. బన్నీ బర్త్ డే సందర్భంగా పుష్ప అనే టైటిల్ ని అధికారికంగా ప్రకటించింది చిత్రయూనిట్.
ఆర్య, ఆర్య 2 చిత్రాల తరువాత స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ & సుకుమార్ కాంబినేషన్ లో వస్తోన్న సినిమా కావడంతో అభిమానుల్లో సినీ వర్గాల్లో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
తొలుత ఈ సినిమాలో విలన్గా విజయ్ సేతుపతి నటిస్తారనే వార్తలు వెలువడ్డాయి. అయితే తాజాగా టీ టౌన్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం బాలీవుడ్ నటులు సంజయ్ దత్ లేదా జాకీ ష్రాఫ్,సునీల్ శెట్టి పేర్లను పరిశీలిస్తున్నారట సుకుమార్ .తెలుగుతో పాటు తమిళ,మలయాళ,కన్నడ ,హిందీ భాషల్లో తెరకెక్కుతుండటంతో బాలీవుడ్ నటుడిని తీసుకుంటే సినిమాకు కలిసివస్తుందని భావిస్తున్నారట. మొత్తంగా విడుదలకు ముందే బన్నీ మూవీపై భారీ హైప్ క్రియేట్ అయింది.