ప్రగతి భవన్‌లో తెలంగాణ కేబినెట్ భేటీ..

180
cm kcr

ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు ప్రగతి భవన్‌లో తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. ప్రధానంగా కరోనాపైనే కేబినెట్ చర్చించనుంది. దీంతో పాటు రాష్ట్రంలో కరోనా పరిస్థితి,ఆర్ధిక పరిస్ధితి వంటి అంశాలపై చర్చించనుంది.

కరోనాను నియంత్రించేందుకు లాక్ డౌన్ పొడగించాలని ఇప్పటికే సీఎం స్పష్టం చేసిన నేపథ్యంలో లాక్ డౌన్ పొడగింపుపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. దీంతో పాటు వడగండ్ల వాన రైతులను నట్టేట ముంచేసింది. రైతులను ఆదుకునేందుకు తీసుకునే చర్యలపై చర్చించనున్నారు.

ఇవాళ ప్రధానమంత్రి మోడీ ఉదయం 11 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తుండడంతో.. ప్రధానికి వివరించాల్సిన అంశాలపైనా కేసీఆర్ అధికారులతో చర్చించారు. కరోనాతో రాష్ట్రంలో తలెత్తిన పర్యవసానాలను ప్రధాని దృష్టికి తీసుకెళ్లాలని భావిస్తున్నారు. రాష్ట్రాలకు మరిన్ని అధికారాలు కల్పించే విధంగా వ్యవహరించాలని మోడీని కోరనున్నారు.