టెస్టుల్లో కీపర్‌గా ధోని ఫెయిల్..!

142
dhoni

టెస్టుల్లో వికెట్ కీపర్‌గా ధోని ఫెయిల్ అయ్యాడని అన్నారు భారత మాజీ వికెట్ కీపర్ కిరణ్ మోరే. కెరీర్ ఆరంభంలోనే బ్యాట్స్‌మెన్‌గా నిరూపించుకున్న ధోనీ.. పేలవ వికెట్ కీపింగ్‌తో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నట్లు వెల్లడించాడు.

వన్డేల్లో ధోని కీపింగ్ సూపర్బ్ అని కానీ టెస్టుల్లో మాత్రం అట్టర్ ఫ్లాప్ అన్నాడు. తన కీపింగ్ బలహీనతల్ని గుర్తించిన మహి…..దానిని అధిగమించేందుకు తీవ్రంగా శ్రమించినట్లు వెల్లడించాడు.

వన్డేలతో పోలీస్తే ధోనికి కీపింగ్‌లో కొత్త ఛాలెంజ్ ఎదురయిందని తెలిపాడు. టెస్టుల్లో రాణించాలంటే శ్రమించాల్సిందేనని ధోని వేగంగా గ్రహించగలిగాడు. ఆ మేరకు కష్టపడ్డాడని వెల్లడించాడు మోరే. 3- 4 మ్యాచ్‌ల్లోనే ధోని సామర్థ్యంపై ఓ అంచనాకి రాకూడదని అప్పట్లో మేనేజ్‌మెంట్ భావించిందని అందుకే అతనికి అవకాశాలు కూడా ఇచ్చిందని చెప్పాడు.