తెలంగాణ పవర్‌ గ్రిడ్‌పై ప్రభావం ఉండదు:ప్రభాకర్ రావు

330
prabhakar rao
- Advertisement -

ఈ ఆదివారం రాత్రి 9 గంటలకు లైట్లు ఆపివేయడం వల్ల తెలంగాణ పవర్ గ్రిడ్ పై ఎలాంటి ప్రభావం పడదన్నారు టీఎస్‌ జెన్‌కో,ట్రాన్స్‌ కో సీఎండీ ప్రభాకర్ రావు. అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ గ్రిడ్ కు ఎలాంటి సమస్య రాకుండా అప్రమత్తంగా ఉన్నామని చెప్పారు.

లైట్లు ఆపివేస్తే గ్రిడ్ కుప్పకూలుతుంది అంటూ జరుగుతున్న ప్రచారం లో వాస్తవం లేదన్నారు. తెలంగాణ పవర్ గ్రిడ్ సురక్షితంగా ఉంది.మా ఇంజనిర్స్ అందరూ వారి జాగ్రత్త లో వారు ఉన్నారు.ఇప్పటికే జాగ్రత్తలు పాటించాలని ఆదేశాలు జారీ చేశాం అన్నారు.

కరోనా కట్టడికి ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపును విజయవంతం చేయాలన్నారు. ప్రజలు అందరు లాక్ డౌన్ పాల్గొని కరోన వ్యాధి వ్యాప్తిని అరికట్టాలని అప్పుడే కరోనా పై మన విజయం సాధిస్తామని చెప్పారు.

- Advertisement -