వినడానికి కొత్తగా ఉన్న బాయ్ ఫ్రెండ్ కోసం దోపిడీలకు సిద్ధపడ్డారు గర్ల్ ఫ్రెండ్స్. వివరాల్లోకి వెళ్తే..వాళ్లిద్దరూ ప్రేమించుకున్నారు.. ఒకరికి ఒకరుగా జీవించాలనుకున్నారు. బాయ్ ఫ్రెండ్ యశ్వంత్ అంటే కిరణ్మయికి చాలా ఇష్టం. దీంతో బాయ్ ఫ్రెండ్ యశ్వంత్ ఆర్థిక ఇబ్బందులు తీర్చేందుకు అడ్డదారులు తొక్కింది. ఇందుకోసం సోషల్ మీడియాని వేదికగా చేసుకుంది.
అంతే ప్లాన్‌ను ఆచరణలో పెట్టింది.ఫేస్ బుక్ ద్వారా వల వేసి.. డబ్బులు కొట్టేద్దామని నిర్ణయించుకుంది. ఇదే విషయాన్ని తన లవర్ కు చెప్పింది. అతను కూడా సరే అన్నాడు. ఇందుకోసం ఫేస్ బుక్ లో కిరణ్మయి అకౌంట్ ఓపెన్ చేసింది. మిడిల్ ఏజ్ ఆంటీలు, టీనేజ్ అమ్మాయిలకు ఫ్రెండ్ రిక్వెస్ట్ లు పంపించి.. స్నేహం చేసింది. సాఫ్ట్ వేర్ ఉద్యోగినిలా చెప్పుకొచ్చింది. అలా మొదలైన స్నేహంతో.. ఫేస్ బుక్ ఫ్రెండ్స్ ఇంటికి వెళ్తూ వాళ్ల అభిమానం సంపాదించింది.
ఈ క్రమంలోనే.. బి.రాజేశ్వరి అనే మహిళ ఇంట్లో 15తులాల బంగారు నగలు కాజేసింది. 2016 నవంబరు 2న సంధ్య అనే అమ్మాయి ఇంట్లో 4.5తులాల బంగారు చైను, ఆమె డెబిట్ కార్డును కిరణ్మయి దొంగిలించింది. డెబిట్ కార్డుతో 30 వేలు డ్రా చేసింది. ఏమీ తెలియనట్టు తిరిగి డెబిట్ కార్డును సంధ్య ఇంట్లో పెట్టింది. డబ్బు మాయం కావటంపై సంధ్య విచారణ చేయగా.. కిరణ్మయి అసలు రూపం బయటపడింది. సీన్ కట్ చేస్తే కిరణ్మయి, ఆమె బాయ్‌ఫ్రెండ్ యశ్వంత్ ని అరెస్టు చేసిన పోలీసులు కోర్టులో హాజరుపరిచారు.