28న ఖైదీ ‘యు అండ్ మీ’ సాంగ్ రిలీజ్‌..

207
You And Me Song Release on 28th Dec
- Advertisement -

తొమ్మిదేళ్ల విరామం తర్వాత మెగాస్టార్‌ చిరంజీవి నటిస్తున్న ఖైదీ నెంబర్‌ 150. సినిమా టీజర్ దగ్గరి నుంచి సాంగ్స్ వరకు అభిమానులు తెగ ఎంజాయ్ చేస్తున్నారు. అమ్మడూ.. లెట్స్‌ డు కుమ్ముడుతో టాలీవుడ్ రికార్డులను మెగాస్టార్ బ్రేక్ చేశాడు. ఈ పాటను రిలీజ్‌ చేసిన 24 గంటల్లోనే 20 లక్షల మందికి పైగా వీక్షించి రికార్డులు తిరగరాశాడు ఖైదీ. తాజాగా ‘సన్న జాజిలా పుట్టే సిందిరో.. మల్లె తీగలా చుట్టేసిందిరో… తేనె టీగలా కుట్టేసిందిరో సుందరీ’ అంటూ చిరు కాజల్‌ని వర్ణిస్తూ పాడిన ఈ పాటకు చిరు ఫాన్స్ ఫిదా అయిపోతున్నారు.

తాజాగా మరో ట్రీట్ ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు చిరు. ఈ నెల 28న ”యు అండ్ మీ” అంటూ ముందుకువస్తున్నాడు.ఇప్పటివరకు రిలీజైన ప్రకటించిన పాటలన్నీ కూడా లీడ్ పెయిర్ మీద వచ్చేవి. ఇంతకీ లక్ష్మీ రాయ్ తో వచ్చే ఆ ఐటెం సాంగును ఎలా కంపోజ్ చేశాడో దేవిశ్రీ.. దాని కోసం మాస్ ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ. ఈలోపు 3వ పాట విడుదల ముహూర్తం ఎనౌన్స్ చేస్తూ కొత్త పోస్టర్ ఒకటి రిలీజ్ చేశారు.

అయితే డిసెంబర్ 25న మొత్తంగా ఆడియో అంతా రిలీజ్ అయిపోతుంది అనుకుంటే.. ఖైదీ టీమ్ మాత్రం.. జనవరి 4న ప్రీ-రిలీజ్ ఈవెంట్ వరకు ఈ పాటల విడుదల కార్యక్రమాన్ని సాగదీసినట్లున్నారు. పైగా లిరిక్స్ తో కూడిన గ్రాఫిక్స్ వీడియోను రిలీజ్ చేయడం వలన.. జనాలకు కూడా ఈ పాటలను వినడమే కాదు చూడాలని ఆతృత పెరిగిపోతోంది.

- Advertisement -