క్యారమ్ సంచలనం హుస్నా సమీరా మరో రికార్డు

129
Husna breaks marathon record

ప్రతి ఒక్కరు జీవితంలో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ లో వల్ల పేరు నమోదు చేసుకోవాలని కళలు కంటూనే ఉంటారు. ఈ కల సాకారం కావాలంటే దానికి గిన కృషి , పట్టుదల మరియు ఓపిక ఉండాలి , అవన్నీ ఉంటేనే కల సాకారం అవుతుంది . అయితే ఈ రోజు విజయవాడ లోని దండమూడి రాజగోపాలం రావు ఇండోర్‌ స్టేడియం లో ముగిసిన మారధాన్ క్యారమ్ లో కుమారి పిక్ హుస్నా సమీరా అద్భుతమైన ప్రతిభ కనబర్చి మరో రికార్డు సొంతం చేసుకుంది.

శ్రీ గాయత్రీ విద్య సంస్థలలో ఇంటర్మీడియట్ చదువుతున్న ఈ ప్రతిభాశాలి అల్లాడ పవన్ తో కలిసి 34 గం. 45 ని. 56 సె. నిర్విరామంగా ఆడి సరి కొత్త రికార్డు నెలకొల్పి తనకంటూ ఒక ప్రత్యేకతను సంతరించుకుంది . గతంలో హుస్నా క్వారమ్ 2012 లో సబ్ జూనియర్ జాతీయ సాయిలో కాంస్య పతాకం , 2010, 2011, 2012, సౌత్ జోన్‌లో 3వ స్థానంలో నిలిచింది. 2016 లో టీం చాంపియన్ షిప్ లో ప్రధమ స్థానంలో నిలిచింది. 2014 , 2015లో 18 గంటల 18 నిమిషాల 18 సెకెన్లు. 18
మంది క్రీడాకారులతో 20 గం, 20 ని .20 సె.20 మంది క్రీడాకారులతో రెండు ప్రపంచ రికార్డులు నెలకొల్పి తనకంటూ ఒక ప్రత్యేకతను సంతరించుకుంది.

గిన్నిస్ నియమాలను పాటిస్తూ స్క్వడ్రం లీడర్ జయ సింహ ఆధ్వన్యంలో మారథాన్ క్యారమ్ లో హుస్నా సమీరా అందరిని ఆకట్టుకొని యువతకు స్పూర్తిదాయకంగా నిలిచింది. ” నా జీవితం లో ఇదొక మైలురాయిగా నేను బావిస్తున్న నాకు చాల సంతోషంగా ఉంది. నేను ఈ స్థాయికి రావడానికి మా తల్లి తండ్రుల కృషి , కుటుంబం ఆదరణ, క్యారమ్ అసోసియషన్ వారీ ప్రోత్సహం , మిత్రులు మరియు ప్రజల ఆదరణే అని తెలిపింది. గత కొద్దీ సంవత్సరాలనుండి ఈ కల నెలవేరడానికి నేను చాల కష్టపడ్డాను , నాకు మా కుటుంభం చాల ప్రోత్సహం లబించింది, మూ అమ్మ నాన్నలు నాకోసం చాల కష్టపడ్డారు. మూ తల్లి శ్రీ సాజిదా ఖాదర్ పట్టుదలతో నేను ఈ స్థాయికి రగలిగానని తెలిపింది.