కరోనాపై పోరుకు విరాళాలు ఇచ్చేందుకు పీఎం కేర్స్(ప్రధాన్ మంత్రి సిటిజన్స్ అసిస్టెన్స్ అండ్ రిలీఫ్ ఇన్ ఎమర్జెన్సీ సిచుయేషన్) ప్రత్యేక నిధిని ఏర్పాటుచేశామని తెలిపారు ప్రధానమంత్రి నరేంద్రమోడీ. అత్యవసర పరిస్థితుల్లో పౌరులకు సహాయం చేసేందుకు…. ఆరోగ్యవంతమైన భారత్కు ఇది దోహదపడుతుందని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఈ నిధిని ప్రధాని చైర్మన్గా ఉండే ట్రస్ట్ నిర్వహిస్తుందని అధికారులు తెలిపారు. ప్రజలు www.pmindia. gov.in సైట్లో విరాళాలు చెల్లించాలన్నారు.
ఇక తొలి విరాళంగా బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ రూ.25 కోట్లు ప్రకటించారు. ఏమీ లేని వారి కోసం నేను ఏమీ చేయకుండా ఎలా ఉండగలను అక్షయ్ చెప్పారని ఆయన్ని చూస్తే గర్వంగా ఉందని తెలిపారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ.
కరోనా వైరస్ దెబ్బకు అల్లాడిపోతున్న భారతావని కష్టాలను చూసి చలించి పోయారు రతన్ టాటా. కరోనాపై పోరుకు రూ.1,500 కోట్ల భారీ సాయాన్ని ప్రకటించారు. టాటా సన్స్ రూ.1,000 కోట్లు, టాటా ట్రస్ట్స్ రూ.500 కోట్ల చొప్పున ఇస్తున్నట్లు ప్రకటించారు.