సినీ కార్మికుల కోసం కరోనా క్రైసిస్ చారిటీ

218
chiru

కరోనా ప్రభావంతో దేశ ఆర్దిక వ్యవస్థ అతలాకుతలం అయ్యే పరిస్థితి నెలకొంది. కరోనా ప్రభావం అన్ని రంగాలపై పడింది. వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు కరోనా నుంచి దేశాన్ని గట్టెక్కించేందుకు తమవంతు సాయం అందిస్తున్నారు.

ఇక తాజాగా సినీ కార్మికులు కరోనాతో తీవ్ర ఇబ్బందులు పడుతుండటంతో వారిని ఆదుకునేందుకు టాలీవుడ్ ముందుకొచ్చింది. మెగాస్టార్ చిరంజీవి ఛైర్మన్‌గా కరోనా క్రైసిస్ చారిటీ(సీసీసీ) ఏర్పాటైంది.

ఇందులో సభ్యులుగా తమ్మారెడ్డి భరద్వాజ, సురేష్‌ బాబు, నేను, ఎన్‌ .శంకర్, సి.కల్యాణ్, దాము ఉన్నారు. తొలుత చిరంజీవి కోటి రూపాయల విరాళాన్ని ప్రకటించగా తర్వాత నాగార్జున కోటి, ఎన్టీఆర్‌ 25లక్షలు విరాళాలు ప్రకటించారు. ఎవరైనా సినిమా పరిశ్రమ కార్మికులను ఆదుకోవచ్చని ఈ సందర్భంగా తెలిపారు తమ్మారెడ్డి భరద్వాజ.