వైరల్‌…:మరో రెండు నెలలు లాక్‌డౌన్‌..!

465
india lockdown
- Advertisement -

కరోనాను కట్టడి చేసేందుకు దేశవ్యాప్తంగా ఏప్రిల్ 14 వరకు అంటే 21 రోజుల పాటు లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. అయితే ఆర్బీఐ ప్రకటన తర్వాత సోషల్ మీడియాలో ఆసక్తికర వార్త చక్కర్లు కొడుతోంది. మూడు నెలల పాటు ఈఎంఐలు కట్టనవసరం లేదని ఆర్బీఐ చెప్పడంతో మే వరకు లాక్ డౌన్ కొనసాగుతుందనే వార్త వైరల్‌గా మారింది.

దీంతో ఈ వదంతులను నమ్ముతున్న ప్రజలు దుకాణాలకు పరుగులు పెడుతున్నారు. బియ్యం, పప్పులు, ఉప్పు, కారం, చింతపండు, మంచి నూనె, సబ్బులు వంటి నిత్యావసర సరుకులను భారీగా నిల్వ చేసుకుంటున్నారు.

ఈ వార్త కొద్దికాలంలోనే వైరల్‌గా మారడంతో మున్ముందు సరుకుల కొరత ఏర్పాటే ప్రమాదం కనిపిస్తోంది. అయితే ఈ వార్తలకు చెక్ పెట్టేలా ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటన రావాలని కొంతమంది అభిప్రాయపడుతున్నారు.

- Advertisement -