నేడు తెలంగాణ‌లో 10 క‌రోనా కేసులు న‌మోదు

202
corona
- Advertisement -

ప్ర‌పంచ‌వ్యాప్తంగా క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతుంది. తెలంగాణలో కూడా క‌రోనా బాధితులు పెరుగుతున్నారు. ఇవాళ ఒక్క రోజే ఏకంగా 10 పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయన్నారు ఆరోగ్య‌శాఖ మంత్రి ఈటెల రాజెంద‌ర్. క‌రోనా నివార‌ణ‌కు ప్ర‌భుత్వ ప‌రంగా అన్నీ చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ట్లు తెలిపారు. ప్ర‌జ‌లు స్వ‌చ్చందంగా ఇళ్ల‌కే ప‌రిమితం కావాల‌ని సూచించారు.

తెలంగాణ‌లో ఇప్ప‌టివ‌ర‌కు 59 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. ఇందులో ఒక‌రు ఆసుప‌త్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇక ప్ర‌పంచ‌వ్యాప్తంగా 5ల‌క్ల‌ల‌కు పైగా పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. ఇందులో ల‌క్ష‌కు పైగా రిక‌వ‌రీ కాగా 23వేల మంది మ‌ర‌ణించారు. ఇండియాలో 799మందికి పాజిటివ్ రాగా. 19 మంది మ‌ర‌ణించారు. ఇప్ప‌టికే దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే . ఎప్రిల్ 14వ‌ర‌కు లాక్ డౌన్ కొన‌సాగ‌నుంద‌ని సీఎం కేసీఆర్ తెలిపారు. ప్ర‌భుత్వానికి ప్ర‌జ‌లు అంద‌రూ స‌హ‌క‌రించాల‌ని కోరారు.

- Advertisement -