నాగర్ కర్నూల్ పట్టణంలో బైక్ పై విస్తృతంగా పర్యటించారు ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి. కరోన వైరస్ నేపత్యంలో ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్ లో నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో క్షేత్రస్థాయి పరిస్థితులను పరిశీలించేందుకు ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి బైక్ పై నాగర్ కర్నూల్ పట్టణంలోని పలు కాలనీలలో విస్తృతంగా పర్యటించారు.
ఈ సందర్భంగా 10వ వార్డులో రేషన్ షాప్ దగ్గర ప్రజలు గుంపులుగా ఉండడం చూసి వెంటనే షాప్ దగ్గరికి వెళ్లి ప్రజలకు కరోన వైరస్ గురించి చెప్పి,నివారణ కోసం పలు సూచనలు చేశారు,ప్రతి ఒక్కరు సామాజిక దూరం పాటించాలి అని సూచించారు రేషన్ షాప్ యజమానికి షాప్ దగ్గర సబ్బు నీళ్లు,సనీటైజార్ లాంటివి ఏర్పాటు చేయాలి అని సూచించారు.
ప్రతి కుటుంభం నుండి ఒక్కరు మాత్రమే వచ్చి ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న 12కిలోల బియ్యాన్ని తీసుకెళ్లాలి అని సూచించారు,త్వరలో1500 రూపాయలను ప్రభుత్వం నేరుగా లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలో వేస్తుంది అని సూచించారు రేషన్ షాప్ దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరు చేతులు శుభ్రంగా కడుకొని ప్రభుత్వం అందజేస్తున్న బియ్యాన్ని తీసుకెళ్లాలి అని సూచించారు.
అదే వార్డులో ఇంకో రేషన్ షాప్ దగ్గర కూడా అదే పరిస్థితి ఉండడంతో ఎమ్మెల్యే అక్కడకి వెళ్లి షాప్ యజమానికి ఆ వార్డ్ కాన్సిలర్ కు సీరియస్ గా ప్రజలు అందరు సామాజిక దూరం పాటించే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు,అన్ని రేషన్ షాప్ లు తెరిచి ప్రజలకు టోకెన్ సిస్టం పెట్టి సరుకులు అందజేయాలి అని సూచించారు,కాలనిలలో బయట ఉన్న ప్రజల దగ్గరికి వెళ్లి ఏప్రిల్ 14వ తేదీ వరకు ఇంట్లో నుండి బయటకు రాకుండా ఉండాలి అని సూచించారు,ఎమ్మెల్యే వెంట తెరాస రాష్ట్ర నాయకులు జక్కా రఘునందన్ రెడ్డి తదితరులు ఉన్నారు.