- Advertisement -
కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకుంది కేంద్ర ఎన్నికల సంఘం. ఈనెల 26న జరగాల్సిన
సభ ఎన్నికలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయో మార్చి తర్వాత ప్రకటిస్తామని తెలిపారు.కాగా ఇప్పటికే రాజ్యసభ ఎన్నిక ఎన్నికల నామినేషన్ పూర్తైన సంగతి తెలిసిందే.
కరోనా వైరస్ నియంత్రణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో.. ఎన్నికల సంఘం కూడా అప్రమత్తమైంది. ఈ ఎన్నికల్లో పలువురు రాజకీయ నాయకులు, ఎమ్మెల్యేలు, ఎన్నికల సిబ్బందితో పాల్గొంటారు కావున జనసమూహం అధికంగా ఉంటుందని భావించి కేంద్ర ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటన విడుదల చేశారు. కాగా దేశవ్యాప్తంగా 17రాష్ట్రాల్లో 55స్ధానాలకు ఎన్నికలు జరుగనున్నాయి.
- Advertisement -