ఖైదీ క్రిస్మస్ కానుక..మరో సాంగ్‌ రిలీజ్‌

236
Khaidi
- Advertisement -

తొమ్మిదేళ్ల విరామం తర్వాత మెగాస్టార్‌ చిరంజీవి నటిస్తున్న ఖైదీ నెంబర్‌ 150.శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఫస్ట్ లుక్‌ దగ్గరి నుంచి రీసెంట్‌గా విడుదలైన అమ్మడూ.. లెట్స్‌ డు కుమ్ముడు వరకు టాలీవుడ్ రికార్డులను తిరగరాసింది. ఈ పాటను రిలీజ్‌ చేసిన 24 గంటల్లోనే 20 లక్షల మందికి పైగా వీక్షించారు.ఇంత తక్కువ సమయంలో ఓ ఆడియో సాంగ్‌కు ఇన్ని లక్షల వ్యూస్‌ రావడం అరుదని లహరి మ్యూజిక్‌ ట్వీట్‌ చేయగా, దాన్ని సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్‌ రీ ట్వీట్‌ చేశాడు.

Khaidi

తాజాగా క్రిస్మస్ కానుకగా ‘సుందరి..’ అనే పాటను శనివారం విడుదల చేస్తామని సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్‌ సోషల్‌మీడియా ద్వారా తెలిపారు. క్రిస్మస్‌ పర్వదినం సందర్భంగా శనివారం సాయంత్రం సుందరి పాటను విడుదల చేశారు. ఈ సందర్భంగా చిరు, కథానాయిక కాజల్‌ ఉన్న ఒక కొత్త పోస్టర్‌ను అభిమానులతో పంచుకున్నారు.  సంక్రాంతి కానుకగా ‘ఖైదీ నంబర్‌ 150’ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

- Advertisement -