ధర్మాధికారి కమీటీ రిపోర్ట్ ప్రకారమే ఉద్యోగుల విభజన

437
cmd prabhakarrao
- Advertisement -

ధర్మాధికారి కమీటీ రిపోర్ట్ ప్రకారమే ఉద్యోగుల విభజన జరుగుతుందన్నారు సీఎండీ ప్రభాకర్ రావు. గత 5 రోజుల నుంచి విద్యుత్ జేఏసీ చేస్తున్న రిలే నిరాహార దీక్షను సీ ఎమ్ డి ప్రభాకర్ రావు విరమింప చేశారు. ఆంధ్రప్రదేశ్ స్థానికత కలిగిన విద్యుత్ ఉద్యోగులను తెలంగాణ లో జాయిన్ చేసుకోకూడదనే ప్రధాన డిమాండ్ తో 5 రోజులుగా రిలే నిరాహారదీక్ష చేస్తున్నారు విద్యుత్ జేఏసీ నాయకులు. ఈసందర్భంగా సీఎండీ ప్రభాకర్ రావు మాట్లాడుతూ.. ఉద్యోగులు అడుగుతున్నది న్యాయమైన డిమాండ్…మీ డిమాండ్ పరిష్కారానికి యాజమాన్యం ప్రయత్నం చేస్తోందన్నారు.

ధర్మాధికారి కమిటీ సూచనాలను సుప్రీంకోర్టు కూడా ఆమోదించినట్లు తెలిపారు. ఎపి ప్రభుత్వం తొందరపడి అక్కడి ఉద్యోగుల ను రిలీవ్ చేసిదన్నారు. సీఎం కేసీఆర్ తో పాటు విద్యుత్ శాఖ మంత్రి అందరూ తెలంగాణ ఉద్యోగుల పక్షానే ఉన్నట్లు స్పష్టం చేశారు.

- Advertisement -