- Advertisement -
కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తున్న నేపథ్యంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తగు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. ఇండియాలో ఇప్పటికే 113 మందికి ఈ వ్యాధి సోకగా ఇద్దరు మరణించారు. ఈ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో విద్యాసంస్ధలు, థియేటర్లు, పార్కులను మూసివేశారు. విద్యార్థులకు ఈ నెల 31 వరకు సెలవులు ప్రకటిస్తున్నట్లు ప్రభుత్వాలు ప్రకటించాయి.
తాజాగా ఉస్మానియా యూనివర్సిటీ కూడా విద్యార్థులకు సెలవులు ఇచ్చినట్లు ప్రకటించింది. కరోనా వ్యాపిస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఓయూ స్పష్టం చేసింది. తాజాగా, హాస్టల్స్ కూడా ఖాళీ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఏ ఒక్కరు కూడా హాస్టల్లో ఉండటానికి వీలు లేదని, వెంటనే ఖాళీ చేసి వెళ్లిపోవాలని ఆదేశించింది. ఇవాళ్టీ నుంచి హాస్టళ్లకు మంచినీరు, విద్యుత్ సరఫరాను నిలిపివేస్తామని అధికారులు ప్రకటించారు.
- Advertisement -