పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చాలా రోజుల తర్వాత సినిమాల్లో నటిస్తున్నారు. బాలీవుడ్ భారీ విజయం సాధించిన పింక్ మూవీ రిమేక్ తో రీ ఎంట్రీ ఇవ్వనున్నాడు. తెలుగులో వకీల్ సాబ్ గా తెరకెక్కుతున్న ఈచిత్రానికి వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే చాలా వరకు ఈమూవీ షూటింగ్ జరుపుకుంది. ఇదిలా ఉండగా ఈమూవీతో పాటు మరో రెండు సినిమాలకు కూడా ఒకే చెప్పేశాడు పవన్. క్రిష్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తుండగా..హరీశ్ శంకర్ దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నారు.
తాజాగా ఉన్న సమాచారం మేరకు పవన్ కళ్యాణ్ మరో రెండు సినిమాలను లైన్లో పెట్టినట్లు తెలుస్తుంది. పవన్ తో జల్సా,, అత్తారింటికి దారేది, అజ్నాతవాసి సినిమాలు తీసిన త్రివిక్రమ్ శ్రీనివాస్ తో పవన్ మరో సినిమా చేయనున్నారట. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడనుంది. ఇక పవన్ కళ్యాణ్ భద్రి, కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమాలు తీసిన పూరీ జగన్నాథ్ తో కూడా సినిమా చేయనున్నట్లు సమచారం. ఇటివలే పవన్ ఈ రెండు సినిమాలు ఒకే చేసినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ 5సినిమాలకు ఒకే చెప్పేశాడు. వకీల్ సాబ్ మూవీని మే15న విడుదల చేయనున్నారు.