కొంతకాలంగా హిట్ కోసం ఎదురుచూస్తున్న అక్కినేని అఖిల్ తాజాగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో మూవీ చేస్తున్నారు. ఈసినిమాకు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ అనే టైటిల్ ఖరారు చేయగా మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ బ్యానర్ పై బన్నీ వాస్ నిర్మిస్తున్నారు.
అఖిల్ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తుండగా 70 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రంలో కీలక యాక్షన్ సన్నివేశాలు చెన్నైలో చిత్రీకరిస్తుండగా.. అఖిల్ గాయపడినట్టు తెలుస్తోంది. అఖిల్ భూజానికి గాయం కావడంతో వారం రోజుల పాటు షూటింగ్‌కి దూరంగా ఉండనున్నారు.
హిట్ రుచి కోసం ఎదురుచూస్తున్న బొమ్మరిల్లు భాస్కర్‌పైనే నమ్మకాలు పెట్టుకున్నారు అఖిల్. ఇటు అఖిల్‌తో పాటు బొమ్మరిల్లు భాస్కర్‌కి కూడా ఈ సినిమా కీలకం అనే చెప్పాలి. వరుస ఫ్లాపుల్లో ఉన్న ఈ దర్శకుడు.. అఖిల్‌తో హిట్ కొట్టి పూర్వవైభవాన్ని అందుకునేందుకు ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ మూవీని మోస్ట్ బ్యూటిఫుల్‌గా రూపొందిస్తున్నారు.