కొత్త మూవీ టైటిల్ ను ప్రకటించిన చిరంజీవి

445
chiranjeevi
- Advertisement -

సైరా నరసింహారెడ్డి చిత్రం తర్వాత మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. ఇటివలే ప్రారంభమైన ఈమూవీ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుపుకుంటుంది. త్రిష హీరోయిన్ గా నటిస్తున్న ఈచిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నిర్మిస్తున్నారు. ఇదిలా ఉండగా నటుడు బ్రహ్మాజీ తనయుడు సంజయ్ రావు నటించిన ‘ఓ పిట్టకథ’ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో నిర్వహించారు.

ఈకార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిధిగా విచ్చేశారు. దీంతో కాసేపు చిత్రయూనిట్ ను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ఆ తర్వాత తన సినిమా గురించి చెప్పారు. కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ సినిమా చేస్తున్నానని చెప్పారు. చిరంజీవి టైటిల్ పేరు చెప్పడంతో అభిమానులు ఆనందంతో కేకలు వేశారు. ఒక్కసారిగా షాక్ అయిన చిరు ఎంటీ టైటిల్ ఇంకా చెప్పలేదుకదా అని అన్నారు. దర్శకుడు కొరటాల శివ టైటిల్ అనౌన్స్ చేసేందుకు పెద్ద ప్రోగ్రామ్ ఏర్పాటు చేసుకున్నాడన్నారు. ఈసందర్భంగా దర్శకడు కొరటాల శివకు సారీ చెప్పారు చిరంజీవి.

- Advertisement -