మహేశ్ బాబు 27 మూవీ విడుదల తేదీ ఖరారు

445
Mahesh-Babu
- Advertisement -

సూపర్ స్టార్ మహేశ్ బాబు వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. సరిలేరు నీకెవ్వరు లాంటి బ్లాక్ బాస్టర్ మూవీ తర్వాత మహేశ్ బాబు ఏ దర్శకుడితో సినిమా చేస్తాడన్నది ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. ఫిలిం నగర్ వర్గాల సమాచారం మేరకు మహేశ్ బాబు తర్వాతి చిత్రం గీత గోవిందం దర్శకుడు పరశురామ్ దర్శకత్వంలో చేయనున్నట్లు తెలుస్తుంది.

దర్శకుడు పరశురామ్ ప్రస్తుతం స్క్రీప్ట్ పనిలో బిజీగా ఉన్నాడు. ఇక మూవీని జులైలో ప్రారంభించనున్నారట. 2021 సమ్మర్ లో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో తెరకెక్కనున్న ఈచిత్రానికి గోపి సుందర్ సంగీతం అందించనున్నారు. జులై లోపు చిరంజీవి కొరటాల మూవీలో మహేశ్ బాబు నటించనున్నట్లు సమాచారం.

- Advertisement -