సీఎం కేసీఆర్ మానసపుత్రిక పట్టణ ప్రగతి కార్యక్రమం అని మంత్రి జగదీశ్ రెడ్డి తెలిపారు.సూర్యాపేట లో ని 33 వ వార్డ్ లో జరుగుతున్న పట్టణ ప్రగతి పనులను మంత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. కాన్వాయ్ పక్కన పెట్టి పాదయాత్ర చేసుకుంటూ ఇల్లు ఇళ్ల్లు తిరిగిన మంత్రి ,ప్రతీ ఇంట్లో గ్రీనరీ ని పెంచడానికి ప్రతీ ఒక్కరు చొరవ చూపాలని కోరారు. గ్రీనరీ పెంచడానికి వీలు కానీ ఇంటి యజమానులు కనీసం రూఫ్ గార్డెన్ ను పెంచాలని అందుకు మున్సిపల్ అధికారులు కూడా కొంత ఆర్థిక సహాయం చేస్తారని మంత్రి కాలనీ వాసులతో మంత్రి అన్నారు.
వార్డుల వారీగా శానిటేషన్ ప్రణాళిక రూపొందించాలి అని అధికారులకు సూచించారు. మన నగరాలను మనమే పరిశుభ్రంగా ఉంచుకుందాం అని జగదీశ్ రెడ్డి పిలుపునిచ్చారు. తడి, పొడి చెత్తను వేరు చేసేలా ప్రజలను చైతన్యపరచాలి అని మంత్రి కోరారు.మున్సిపాలిటీలో 10 శాతం నిధులు పచ్చదనం పెంపునకు ఖర్చు చేయాలి అని మంత్రి జగదీశ్ రెడ్డి సూచించారు. పట్టణాల్లో పారిశుద్ద్యం, పచ్చదనం పెరగాలన్నారు.
నాటిన మొక్కల్లో 85 శాతం బతకాలి.. అన్నారు.75 గజాల లోపల ఇల్లు కట్టుకుంటే ఎలాంటి అనుమతి అవసరం లేదు అని మరోమారు మంత్రి స్పష్టంచేశారు.మంత్రి జగదీశ్ రెడ్డి తో పాటు మున్సిపల్ చైర్మన్ పెరుమాళ్ళ అన్నపూర్ణ, వైస్ ఛైర్మన్ పుట్టా కిషోర్, మున్సిపల్ కమిషనర్ రామంజి రెడ్డి ,మున్సిపల్ అధికారులు ,కాలనీ వాసులు పాల్గొన్నారు.